Begin typing your search above and press return to search.

థ‌గ్స్‌ కి జ‌క్క‌న్న‌ - క‌మ‌ల్ ప్ర‌మోష‌న్‌

By:  Tupaki Desk   |   28 Sept 2018 11:10 AM IST
థ‌గ్స్‌ కి జ‌క్క‌న్న‌ - క‌మ‌ల్ ప్ర‌మోష‌న్‌
X
3 నిమిషాల 36 సెక‌న్ల హిందీ ట్రైల‌ర్‌ తో గ‌జ‌గ‌జ ఒణికించారు థ‌గ్స్. 2018 మోస్ట్ అవైటెడ్ మూవీగా ప్ర‌చారం అవుతున్న `థ‌గ్స్ ఆఫ్ హిందూస్తాన్` దీపావ‌ళి కానుక‌గా న‌వంబ‌ర్ 8న రిలీజ‌వుతున్న సంగ‌తి తెలిసిందే. ఈ సినిమాకి బాలీవుడ్‌ లో ప్ర‌చారాన్ని మించి ప్రాంతీయ భాష‌ల్లో ప్ర‌చారం చేసేందుకు అమితాబ్ - అమీర్ - విజ‌య్ కృష్ణ ఆచార్య బృందం ప్రిప‌రేష‌న్‌ లో ఉంది. అందుకు త‌గ్గ‌ట్టే ఇటీవ‌ల వీడియో టీజ‌ర్‌ ల‌ను సామాజిక మాధ్య‌మాల ద్వారా య‌శ్‌ రాజ్ ఫిలింస్ ప్ర‌చారం చేసింది.

థ‌గ్స్ అమితాబ్ - అమీర్ నేరుగా ప్ర‌మోష‌న‌ల్ బ‌రిలో దిగి చిత్ర‌విచిత్ర విన్యాసాల‌కు దిగుతున్నారు. నిన్న‌(గురువారం)నే హిందీ ట్రైల‌ర్‌ తో మెరుపులు మెరిపించారు. తాజాగా తెలుగు - త‌మిళ్ ట్రైల‌ర్ల‌ను రిలీజ్ చేశారు. తెలుగు ట్రైల‌ర్‌ ను బాహుబ‌లి ద‌ర్శ‌క‌డు ఎస్‌.ఎస్‌.రాజ‌మౌళి లాంచ్ చేస్తే - త‌మిళ ట్రైల‌ర్‌ ను ఉల‌గ‌నాయ‌గ‌న్ క‌మ‌ల్ హాస‌న్ లాంచ్ చేశారు. ఇరువురు టాప్ సెల‌బ్రిటీల‌తో ప్రాంతీయం గానూ థ‌గ్స్ ప్ర‌చారం చేయించ‌డాన్ని బ‌ట్టి ఇక్క‌డ ఏ రేంజులో ప్లాన్ చేశారో అర్థం చేసుకోవ‌చ్చు.

1795 హిందూస్తాన్ .. ఈస్ట్ ఇండియా కంపెనీ వ‌చ్చిందైతే వ్యాపారం కోస‌మే కానీ ఇప్పుడ‌ది అధికారం చెలాయిస్తోంది. కానీ బానిస‌త్వానికి త‌ల ఒగ్గ‌ని వారు కొంద‌రున్నారు. శ్వేత జంబూకాల అణ‌చివేతకు బ‌రిలో దిగారు అంటూ అదిరిపోయే సంభాష‌ణ‌లు వినిపించారు. ``హిందూస్తానీ మ‌న‌కు శ‌త్రువు .. పేరు ఆజాద్`` అంటూ అమితాబ్ రేంజుకు ఎలివేట్ చేస్తూ... అత‌డిని ఇంట్ర‌డ్యూస్ చేశారు. ``ఆజాద్‌ ని ప‌ట్టుకోవాలంటే ఆజాద్ లాంటి థ‌గ్ యే కావాలి`` అంటూ తెల్లోడు కుట్ర చేస్తే... పిరంగి మ‌ల్ల‌య్య .. గోపాల్ పురం గ్రామం.. కాన్పూర్ జిల్లా.. అంటూ అమీర్‌ ఖాన్‌ ని అంతే స్టైలిష్‌ గా ఇంట్ర‌డ్యూస్ చేశారు. స్వాతంత్య్రం నేర‌మైతే - శిక్ష నాకు స‌మ్మ‌త‌మే.. ఖుదా ఏది కోరుకుంటే ఇప్పుడు అదే జ‌రుగుతుంది!! అంటూ థ‌గ్స్ చేయ‌బోతున్న పోరాటాన్ని ఎలివేట్ చేశారు. ``సార్ కంత్రీని ఇంగ్లీష్‌ లో ఏమంటారండీ.. బ్లాస్ట‌ర్డ్.. మ‌నం అదే నండీ..`` అంటూ అమీర్ పాత్ర‌లో క‌న్‌ ని ఆవిష్క‌రించారు. ``ద్రోహం చేయ‌డం నా స్వ‌భావం.. న‌మ్మ‌డం నా స్వ‌భావం.. ``అంటూ బిగ్‌ బి-అమీర్ వార్‌ తో ఫినిషింగ్ అంతే ప‌వ‌ర్‌ ఫుల్‌ గా ఉంది. ఓవ‌రాల్‌ గా తెలుగు ట్రైల‌ర్ చూశాక థ‌గ్స్ కాన్సెప్టుపై పూర్తి క్లారిటీ వ‌చ్చేసింది. ఈస్ట్ ఇండియా కంపెనీ నుంచి స్వాతంత్య్ర కోసం థ‌గ్స్ చేసిన పోరాట‌మే ఇద‌ని అర్థ‌మ‌వుతోంది.