Begin typing your search above and press return to search.

కమల్ ఎవరితో రొమాన్స్ చేసేది చెప్పడట

By:  Tupaki Desk   |   22 Nov 2015 1:00 PM IST
కమల్ ఎవరితో రొమాన్స్ చేసేది చెప్పడట
X
చిన్నపుడు ఆడుకునే ‘అమ్మా నాన్న ఆట’ ఎవరికైనా మధుర జ్నాపకమే. ఐతే ఈ చిన్న పిల్లల ఆటనే సినిమా పేరుగా మార్చేస్తున్నాడు కమల్. తన కొత్త సినిమాకు ఆయన ‘అమ్మానాన్న ఆట’ అనే పేరు పెట్టాడు. అసలే రొమాంటిక్ కామెడీలకు పెట్టింది పేరైన కమల్.. చిన్న పిల్లలు ఆడుకునే రొమాంటిక్ గేమ్ నేపథ్యంలో సినిమా తీస్తున్నాడంటే రొమాన్స్ తో - కామెడీతో రెచ్చిపోతాడనడంలో సందేహం లేదు. ఈ సినిమాలో ముగ్గురు హీరోయిన్లు నటిస్తారని.. అందులో ఇద్దరు సీనియర్లని చెప్పాడు కమల్. ఆ సీనియర్లిద్దరూ అమల - జరీనా వాహబ్ అన్న సంగతి ఇప్పటికే వెల్లడైంది. ఐతే ఇందులో ఓ యంగ్ హీరోయిన్ కూడా నటిస్తుందని తెలిపాడు కమల్. అమలది పూర్తి స్థాయి పాత్ర కాదని.. ఆమెది గెస్ట్ రోల్ అని.. ఇన్నేళ్ల తర్వాత తామిద్దరం కలిసి నటించడం చాలా ఆనందంగా ఉందని ‘చీకటి రాజ్యం’ సక్సెస్ మీట్ లో వెల్లడించాడు లోకనాయకుడు.

సినిమా విశేషాల గురించి ఆయన మాట్లాడుతూ.. ‘‘టైటిల్‌ చూస్తేనే ఇదొక ఫ్యామిలీ డ్రామా అని అర్థమైపోతుంది. రొమాన్స్‌ - కామెడీ ఆక‌ట్టుకుంటాయి. నా స్నేహితుడు - మ‌ల‌యాళంలో ఫేమ‌స్ డైరెక్ట‌ర్ అయిన రాజీవ్ కుమార్ ఈ చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తాడు. అమల - జ‌రీనాలతో పాటు మ‌రో యంగ్ హీరోయిన్ కూడా ఇందులో ఉంటుంది. ఐతే ఈ సినిమాలో నేను ఎవ‌రితో రొమాన్స్ చేస్తానన్న‌ది ప్ర‌స్తుతానికి స‌స్పెన్స్‌’’ అన్నారు కమల్.