Begin typing your search above and press return to search.
కోటి ఆర్థిక సాయం ప్రకటించిన కమల్
By: Tupaki Desk | 20 Feb 2020 6:35 PM ISTఇండియన్ 2 చిత్రం షూటింగ్ సందర్బంగా క్రేజ్ కూలి మృతి చెందిన ముగ్గురు టెక్నీషియన్స్ కు ఆ చిత్ర హీరో కమల్ హాసన్ కోటి రూపాయల సాయంను ప్రకటించారు. యూనివర్శిల్ స్టార్ మృతుల కుటుంబాలను ఆదుకుంటానంటూ హామీ ఇచ్చిన కొద్ది సమయానికే కోటి రూపాయల ఆర్థిక సాయంను ప్రకటించిన నిజమైన హీరో అనిపించుకున్నాడు. మృతుల కుటుంబాలకు అండగా ఉంటానంటూ హామీ ఇచ్చాడు.
కమల్ హాసన్ కోటి సాయంపై అంతా ప్రశంసలు కురిపిస్తున్నారు. మంచి మనసుతో తన టెక్నీషియన్స్ కు ఇంత భారీ ఆర్థిక సాయం ప్రకటించడం పట్ల ఆయన గొప్పతనం అర్థం అవుతుందని అభిమానులు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇక శంకర్ ఆరోగ్య పరిస్థితిపై ఆందోళన వ్యక్తం అవుతుంది. ఆయన హెల్త్ పరిస్థితి ఏంటీ.. ఆయన కాళు విరిగిందని వార్తలు వచ్చాయి. ఎలా ఉన్నాడు అనే విషయాలపై ఎలాంటి క్లారిటీ ఇవ్వడం లేదు.
కమల్ సాయంతో పాటు నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ వారు కూడా చనిపోయిన ముగ్గురి కుటుంబ సభ్యులకు ఆర్థిక సాయం అందించేందుకు సిద్దంగా ఉన్నట్లుగా తెలుస్తోంది. లైకా ప్రొడక్షన్స్ బ్యానర్ లో భారీ బడ్జెట్ తో రూపొందుతున్న ఈ చిత్రం షూటింగ్ మొదటి నుండి ఏదో ఒక అడ్డంకుల వల్ల వాయిదాలు పడుతూనే ఉంది. ఎట్టకేలకు షూటింగ్ సాఫీగా సాగుతుందని భావిస్తున్న తరుణంలో ఇలా అయ్యిందని యూనిట్ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు.