Begin typing your search above and press return to search.

కమల్ కాన్ఫిడెన్స్.. వేరే లెవెల్

By:  Tupaki Desk   |   9 Jun 2022 2:30 PM GMT
కమల్ కాన్ఫిడెన్స్.. వేరే లెవెల్
X
విశ్వనటుడు కమల్ హాసన్ చాలా రోజుల తర్వాత మొత్తానికి బాక్సాఫీస్ వద్ద సరైన విజయం సొంతం చేసుకున్నాడు. లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద రికార్డులు క్రియేట్ చేస్తోంది.

ఇక ఈ సినిమా సాధించిన విజయంతో కమల్ హాసన్ అయితే ఫుల్ జోష్ లో ఉన్నాడు అని చెప్పాలి. ఇప్పటికే ఆనందంలో సినిమాకు పనిచేసిన వారికి ప్రత్యేకంగా ఖరీదైన కానుకలను కూడా అందజేశారు.

దర్శకుడికి ఒక లగ్జరీ కారును హీరో సూర్య కోసం రోలెక్స్ వాచ్ ను బహుమతిగా ఇచ్చాడు. అలాగే సహాయక దర్శకులకి ఖరీదైన బైక్లను కూడా కానుకగా ఇచ్చాడు. అయితే ఈ సినిమా విజయంపై కమల్ హాసన్ అయితే ముందుగానే చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాడు.

ముఖ్యంగా తెలుగులో అయినవి భారీ స్థాయిలో ఓపెనింగ్స్ అందుకొని చాలా కాలం అయింది. విక్రమ్ సినిమా మాకు తెలుగులో కూడా మంచి స్పందన వస్తుందని ముందుగానే కమల్ హాసన్ చాలా నమ్మకంతో ఉన్నాడు.

చాలా కాలంగా కమల్ హాసన్ కు తెలుగులో వరుసగా అపజయాలు వస్తుండడంతో మార్కెట్ కోల్పోవాల్సి వచ్చింది. అయితే డిస్ట్రిబ్యూటర్స్ ఎవరు కూడా కమల్ హాసన్ సినిమాను తెలుగులో విడుదల చేసేందుకు పెద్దగా పోటీ పడ లేదు. ఇక నితిన్ తండ్రి సుధాకర్ రెడ్డి తెలుగులో ఈ సినిమాను విడుదల చేశాడు. అయితే కమల్ సినిమా విడుదలకు ముందే జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్ లో తెలుగు ప్రేక్షకులు ఈ సినిమాను తప్పకుండా ఆదరిస్తారు అనే ధీమాగా చెప్పాడు.

మంచి కంటెంట్ తెలుగువారి ముందుకు వస్తే ఎప్పుడు కూడా అపజయం రాలేదు అని.. ఒక విధంగా తమిళ ప్రేక్షకుల కంటే ముందుగా తెలుగు ప్రేక్షకులకు తనకు ఎక్కువ విజయాలు అందించారు అనే పాత రోజులను గుర్తు చేసుకున్నాడు. ఇక విక్రమ్ సినిమా కూడా అంతే విజయాన్ని అందుకుంటుందని కమల్ హాసన్ రిలీజ్ కు ముందు వివరణ ఇచ్చాడు. ఇక అనుకున్నట్లుగానే కమల్ హాసన్ చెప్పి మరి బాక్సాఫీసు వద్ద హిట్ కొట్టాడు.