Begin typing your search above and press return to search.

స‌ల్మాన్..షారుక్..అమీర్ పై మ‌రో ఖాన్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

By:  Tupaki Desk   |   8 Jan 2022 2:30 AM GMT
స‌ల్మాన్..షారుక్..అమీర్ పై మ‌రో ఖాన్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు
X
బాలీవుడ్ స్టార్ హీరోలు స‌ల్మాన్ ఖాన్..షారుక్ ఖాన్..అమీర్ ఖాన్ రెండు ద‌శాబ్ధాల‌కుపైగా వెండి తెర‌ను ఏల్తోన్న బిగ్ స్టార్స్. ఖాన్ త్ర‌యం ఎంతో ప్ర‌త్యేక‌త గ‌ల హీరోలు. ఎన్నో బ్లాక్ బ‌స్ట‌ర్ల‌ని అందించిన హీరోలు. బాలీవుడ్ నే శాషిస్తోన్న హీరోలుగా చెప్పొచ్చు. అయితే కొంత కాలంగా ఈ ముగ్గురు రేసులో వెనుక‌బ‌డ్డారు. వ‌రుస ప‌రాజ‌యాలు వెంటాడుతున్నాయి. అమీర్ న‌టించిన `థ‌గ్స్ ఆఫ్ హిందుస్తాన్`..షారుక్ ఖాన్ న‌టించిన `జీరో`.. `జ‌బ్ హ్యారీ మెట్ సెజ‌ల్`...స‌ల్మాన్ ఖాన్ న‌టించిన `యాంటిమ్`.. `రాధే`..`ద‌బాంగ్ -3` చిత్రాలు బాక్సాఫీస్ వ‌ద్ద ఘోరమైన ప‌రాజ‌యాలు చ‌విచూసాయి.

భారీ బడ్జెట్ తో..భారీ అంచ‌నాల మ‌ధ్య‌ విడుద‌లైన చిత్రాలు ఊహించ‌ని ప‌రాభ‌వాన్ని మూట‌గ‌ట్టుకున్నాయి. ఆ ప‌రాభ‌వాల్ని `లాల్ సింగ్ చ‌ద్దా` స‌క్సెస్ తో అమీర్... `ప‌టాన్`..`టైగ‌ర్ -3` చిత్రాల‌తో స‌ల్మాన్ బ్రేక్ చేయాల‌ని క‌సిమీద ఉన్నారు. అభిమానులు సైతం ఈ చిత్రాల స‌క్సెస్ తో మ‌ళ్లీ ఫామ్ లోకి రావాల‌ని ఎంతో ఆశ‌ప‌డుతున్నారు. ఈ నేప‌థ్యంలో ఖాన్ హీరోల‌పై క‌మ‌ల్ ఆర్ ఖాన్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసారు. ఖాన్ ల శ‌కం ముగ‌సింద‌ని ఆరోపించారు. దానికి సంబంధించి ఓ ట్వీట్ చేసారు. ``వ‌కంత కిసీ కా..వ‌క్త ఆనా జానా హే. మొగ‌లోన్..ఆంగ్రేజోంకి బాద‌షాహ‌త హిందుస్తాన్ ప‌ర్ న‌హీం ర‌హీ ఘ‌మండీ ఖానోంకి బాద‌షాహ‌త్ బాలీవుడ్ ప‌ర్ న‌హీం ర‌హీ` అని ట్వీట్ చేసారు.

`` స‌మ‌యం ఎవ‌రికి చెంద‌దు. కాలం అంద‌రి విష‌యంలో వ‌స్తుంది పోతుంది. మొఘ‌లులు..బ్రిటీష‌ర్లు భార‌త‌దేశాన్ని పాలించారు. తిరగి మ‌ళ్లీ వాళ్ల దేశం వెళ్లిపోయారు. ఇప్పుడు బాలీవుడ్ లో ఖాన్ ల ట్రెండ్ కూడా ముగిసింది అని క‌మ‌ల్ ఆర్ ఖాన్ ఆరోపించారు. ఇప్పుడీ వ్యాఖ్య‌లు బాలీవుడ్ లో సంచ‌ల‌నంగా మారాయి. నేరుగా ఖాన్ వ‌ర్గానికి చెందిన వారే ఇలా స్పందించ‌డ‌పై వాడివేడి చ‌ర్చ సాగుతోంది. మ‌రి ఈ వ్యాఖ్య‌ల‌పై సల్మాన్...షారుక్...అమీర్ ఖాన్ లు ఎలా స్పందిస్తారో చూడాలి.