Begin typing your search above and press return to search.

ఆ పెద్ద హీరో తాగుబోతట..ఇడియట్ అట..

By:  Tupaki Desk   |   20 May 2016 1:30 AM GMT
ఆ పెద్ద హీరో తాగుబోతట..ఇడియట్ అట..
X
ఇండియాలో అత్యంత పెద్ద బ్యాగ్రౌండ్ ఉన్న సినిమా ఫ్యామిలీ ఏదంటే కపూర్స్ దే. ఆ ఫ్యామిలీలోని పెద్ద హీరోల్లో రిషి కపూర్ ఒకడు. ఇప్పటికీ తనకంటూ ఓ ఇమేజ్ ఉన్న ఆ పెద్దాయన్ని పట్టుకుని కమల్ ఆర్.ఖాన్ అనే పబ్లిసిటీ పిచ్చోడు నానా మాటలు అనేశాడు. ఇంతకీ రిషి కపూర్ ను కమల్ ఎందుకు టార్గెట్ చేశాడు అంటే.. ఆయన గాంధీ కుటుంబం మీద విమర్శలు గుప్పించడమే. దేశంలో ఎక్కడికెళ్లినా ఇందిరా గాంధీ.. రాజీవ్ గాంధీ పేర్లే కనిపిస్తున్నాయని.. దేశానికి ఆ ఇద్దరు మాత్రమే సేవ చేశారా.. అంటూ ట్విట్టర్లో ఈ మధ్య ప్రశ్నించారు రిషి కపూర్. దీని మీద కమల్ బాబుకి కోపం వచ్చేసింది.

మందు కొట్టి ఇందిరా గాంధీ లాంటి నాయకురాలిని తిట్టిపోసిన రిషి కపూర్ పెద్ద ఇడియట్ అని.. మోడీ సైతం ప్రశంసించిన నాయకురాలు ఇందిరా గాంధీ అని.. ఇప్పుడు జీవించి లేని అలాంటి గొప్ప నాయకురాల్ని తిడతావా అంటూ విరుచుకుపడ్డాడు కమల్. అంతే కాదు.. మీ చెత్త ఫ్యామిలీ మొత్తాన్ని కూడా ఇందిరా గాంధీ లాంటి గొప్ప ప్రధానితో పోల్చలేమని ఇంకా ఏవేవో హిందీలో బండ బూతు పదాలు కూడా వాడేశాడు కమల్. ఐతే కమల్ కు ఇంతగా ఎందుకు రెస్పాండయ్యాడన్నది అతణ్ని ఫాలో అయ్యే జనాలకు బాగానే తెలుసు.

నిజానికి బాలీవుడ్ అంతా ఇతణ్ని ఓ పెద్ద ఇడియట్ లాగా చూస్తుంది. సెలబ్రెటీల్ని టార్గెట్ చేసిన ఏదో ఒక కూత కూయడం.. వాళ్లు తిరిగి స్పందిస్తే మంచి పబ్లిసిటీ వచ్చిందని జబ్బలు చరుచుకోవడం.. ఇదీ కమల్ బాబు వరస. ఈ మధ్య పవన్ కళ్యాణ్ ను టార్గెట్ చేసి విమర్శలు చేసింది కూడా అందుకే. ఆ దెబ్బతో తెలుగు రాష్ట్రాల్లో కూడా ఫేమస్ అయిపోదామనుకున్నాడు. కానీ మనోళ్లకు కూడా అతనో ఇడియట్ అని తెలిసిపోయినట్లుంది.. పట్టించుకోలేదు. ఇప్పుడు రిషి కపూర్ ను తిట్టిపోస్తే ఆయన ఫ్యాన్స్ తన మీద అటాక్ చేసి పబ్లిసిటీ తెస్తారన్నది అతడి ప్లాన్. మరి కపూర్ ఫ్యాన్స్ ఏం చేస్తారో చూడాలి.