Begin typing your search above and press return to search.

ఆ సినిమా తీసిన వాళ్లను జైల్లో పెట్టాలట

By:  Tupaki Desk   |   15 July 2017 10:55 AM GMT
ఆ సినిమా తీసిన వాళ్లను జైల్లో పెట్టాలట
X
బాలీవుడ్లో తానో పెద్ద క్రిటిక్ అని చెప్పుకునే కమల్ ఆర్.ఖాన్ మళ్లీ లైన్లోకి వచ్చాడు. ఈ మధ్య తరచుగా సౌత్ స్టార్ల మీద పడుతూ వచ్చిన కమల్.. ఇప్పుడు ఓ కొత్త బాలీవుడ్ సినిమాను ఉతికారేశాడు. శుక్రవారం రిలీజైన రణబీర్ కపూర్-కత్రినా కైఫ్ ల ‘జగ్గా జాసూస్’ సినిమా గురించి దారుణమైన వ్యాఖ్యలు చేశాడు. ఈ సినిమా కథేంటో చెప్పిన వాళ్లకు కోటి రూపాయలిస్తా.. నా జీవితంలో ఇంత చెత్త సినిమాఎప్పుడూ చూడలేదు.. సినిమా తీసిన దర్శకుడు వెంటనే రిటైరవ్వాలి.. ఈ చిత్ర దర్శక నిర్మాతల్ని జైల్లో పెట్టాలి.. ఇలా తనదైన శైలిలో అతి వ్యాఖ్యలు చేశాడు కమల్. ‘జగ్గా జాసూస్’కు నెగెటివ్ టాక్ వస్తున్న మాట వాస్తవమే కానీ.. అతను మరీ దారుణమైన వ్యాఖ్యలు చేశాడు ఈ సినిమా గురించి. ఇంతకీ ట్విట్టర్లో కమల్ ఏమన్నాడంటే..

‘‘జగ్గా జాసూస్ ఎంత చెత్తగా ఉందో చెప్పడానికి నాకు మాటలు రావట్లేదు. దర్శకుడు అనురాగ్ బసుకు ఒక్క శాతం సిగ్గున్నా అతను ‘జగ్గా జాసూస్’ తీసినందుకు క్షమాపణలు చెప్పి తక్షణం సినిమాల నుంచి రిటైరవ్వాలి’’

‘‘జగ్గా జాసూస్ కథేంటో ఎవరైనా చెబితే.. కోటి రూపాయలు బహుమతిగా ఇస్తా’’

‘‘నా జీవితంలో నేను చూసిన అత్యంత చెత్త సినిమా ఇదే. ఇక జీవితంలో ఇంతకంటే చెత్త సినిమా చూడలేనని అనుకుంటున్నా’’

‘‘ప్రభుత్వం అవినీతి కేసుల కింద ‘జగ్గా జాసూస్’ తీసిన వాళ్లపై కఠిన చర్యలు తీసుకోవాలి. కనీసం వారం రోజుల పాటు వాళ్లను జైల్లో ఉంచాలి’’

‘‘జగ్గా జాసూస్ సినిమాకు 5కు పది స్టార్ల రేటింగ్ ఇస్తున్నా. ఇలాంటి సినిమాను బాలీవుడ్ చరిత్రలో ఇంకెవ్వరూ ఆవిష్కరించలేరు’’

‘‘జగ్గా జాసూస్ సినిమాకు చెత్త కలెక్షన్లు వస్తున్నాయి. రణబీర్ నటించిన బేషారామ్.. బాంబే వెల్వెట్ లాగే ఇది కూడా పెద్ద ఫ్లాపవుతుంది’’