Begin typing your search above and press return to search.

పవన్ పవర్ బాలీవుడ్ కి తగిలింది

By:  Tupaki Desk   |   21 March 2016 1:30 PM GMT
పవన్ పవర్ బాలీవుడ్ కి తగిలింది
X
బాలీవుడ్ జోకర్ కం యాక్టర్ కమల్ ఆర్ ఖాన్. ఇతగాడి గురించి ఇక్కడి జనాలకు పెద్దగా ఏం తెలీకపోయినా.. పవన్ కళ్యాణ్ పై వివాదాస్పద ట్వీట్స్ చేసి ఒక్కసారిగా పాపులర్(అన్ పాపులర్) అయ్యాడు. పవన్ తన సర్దార్ గబ్బర్ సింగ్ ను హిందీలో రిలీజ్ చేస్తానని చెప్పినప్పటి నుంచే ఈ దాడి మొదలైందని.. పవర్ ఎంట్రీ కి భయపడే ఈ దాడి అనే మాటను తుపాకి ముందే చెప్పింది.

అయితే పవన్ పై ఇలాంటి కామెంట్స్ చేయడం కరెక్ట్ కాదని బాలీవుడ్ జనాలు కూడా చెప్పినా వినిపించుకోకుండా తెగ పేలిన కమల్ ఆర్ ఖాన్ కి.. ఇప్పుడు పవన్ కళ్యాణ్ పవర్ చూసి వణుకు పుట్టిందని తెలుస్తోంది. అందుకే డ్యామేజ్ కంట్రోల్ లో భాగంగా పవన్ అంటే తెగ ఇష్టం పుట్టేసింది అంటున్నాడు కమల్ ఆర్ ఖాన్. 'తెలుగులో పవన్ కళ్యాణ్ పెద్ద సూపర్ స్టార్ అనే విషయం నాకు ఇప్పుడే తెలిసింది. అందుకే ఐ లవ్ హిమ్. అయినా సరే.. అతని సినిమా హిందీలో రిలీజ్ కావడానికి వీల్లేదు'.. ఇదీ ఆ పూర్తి పిచ్చోడి ట్వీట్.

అంతే కాదు.. రజినీకాంత్ - పవన్ కళ్యాణ్ ఇద్దరినీ ఇప్పుడు తాను ఇష్టపడుతున్నానంటూ మరో ట్వీట్ కూడా పెట్టి, పవన్ ని ట్యాగ్ చేశాడు. అంటే వివాదం తగ్గించేందుకు ప్రయత్నించమని అభ్యర్ధించడం అన్నమాట. ఇంతగా జ్ఞానోదయం కలగడానికి కారణం.. అటు పొలిటికల్ గా, ఇటు సినిమాల్లోనూ పవన్ రేంజ్ గురించి ఈ క్రిటిక్ కి డైరెక్ట్ గా తలంటు పోశారట. అంతే కాదు.. ఆడియో ఫంక్షన్ కోసం జరుగుతున్న ఏర్పాట్లు - ఇంటెలిజెన్స్ హడావిడి చూసి.. ఈ కమల్ ఆర్ ఖాన్ కి జ్ఞానోదయం అయిందంటున్నారు. మొత్తానికి ఇంకా అడుగు పెట్టకుండానే కమల్ ఆర్ ఖాన్ నోరు మూయించాడంటే.. బాలీవుడ్ లో పవన్ పవర్ అప్పుడే స్టార్ట్ అయిపోయినట్లే.