Begin typing your search above and press return to search.

పవన్ ఓ జోకరట.. అతడి సినిమా చూడడట

By:  Tupaki Desk   |   17 March 2016 6:23 AM GMT
పవన్ ఓ జోకరట.. అతడి సినిమా చూడడట
X
కమాల్ ఆర్.ఖాన్ అని ముంబయిలో ఓ పెద్ద జోకర్ ఉన్న సంగతి మన జనాలకు పెద్దగా తెలియదు. తనో పెద్ద క్రిటిక్ లాగా ఫీలవుతూ.. సినిమాల్ని రివ్యూ చేస్తుంటాడు. అలాగే బాలీవుడ్ సెలబ్రెటీల మీద పిచ్చి పిచ్చి వ్యాఖ్యలు చేస్తుంటాడు. మామూలుగా అతడి మాటల్ని అక్కడెవ్వరూ పట్టించుకోరు. ఐతే సోనాక్షి సిన్హా లాంటి వాళ్లకు మాత్రం మండిపోయి అతణ్నిచెడామడా తిట్టిపోశార్లెండి. కమల్ కోరుకునేది కూడా ఇదే. తాను ఎవర్నో ఒకర్ని కెలకడం.. వాళ్లు రెస్పాండయితే మంచి పబ్లిసిటీ వచ్చిందని సంబరపడటం.. ఇదీ అతడి స్టయిల్. ఆ మధ్య బాహుబలి సినిమా మీద కూడా ఇలాగే చెత్త వ్యాఖ్యలు చేశాడు. ప్రభాస్ - రానా వేస్ట్ అన్నట్లు మాట్లాడుతూ.. బాహుబలి సినిమా మీద కూడా విమర్శలు గుప్పించాడు.

ఇప్పుడు లేటెస్టుగా పవన్ కళ్యాణ్ మీద పడ్డాడు కమల్. ‘సర్దార్ గబ్బర్ సింగ్’ సినిమాను హిందీలో కూడా రిలీజ్ చేస్తున్న నేపథ్యంలో కమాల్ తన నోటికి పని చెప్పాడు. పవన్ మీద, అతడి అభిమానుల మీద తీవ్ర వ్యాఖ్యలు చేశాడు. పవన్ కళ్యాణ్ ఒక జోకర్ అని.. తాను అతడి సినిమాలు చూడనని అన్నాడు. ‘‘ఈ పవన్ కళ్యాణ్ కూడా హీరో అయితే.. ప్రపంచంలో ఎవ్వరైనా హీరో కావచ్చు. అసలీ సౌత్ ఇండియా జనాలకు ఏమైంది? సినిమాల్లో ఈ కార్టూన్ ను వాళ్లెలా చూస్తారు? వెరీ బ్యాడ్ చాయిస్. నేనైతే ఈ జోకర్ - కార్టూన్ సినిమాల బదులు రాజ్ పల్ యాదవ్ (బాలీవుడ్ కమెడియన్) సినిమాలు చూస్తా’’ అని వ్యాఖ్యానించాడు కమాల్. పవన్ అభిమానులు తన మీద అటాక్ మొదలెడితే.. మంచి పబ్లిసిటీ వస్తుందని అతడి ప్లాన్. మరి పవన్ ఫ్యాన్స్ అతడు కోరుకున్నట్లే చేస్తారా.. లేక కకమాల్ ను ఇగ్నోర్ చేసి అతడికి సరైన బుద్ధి చెబుతారా.. అన్నది చూడాలి.