Begin typing your search above and press return to search.
కళ్యాణ రాముని ఓటీటీ ప్లాన్ ఎంతవరకూ?
By: Tupaki Desk | 27 Jun 2020 10:30 AM IST2007లో `లక్ష్మీ కల్యాణం` అనే చిత్రంతో హీరోగా ఆరంగేట్రం చేసిన కళ్యాణరాముడు ఇప్పటికే డజను పైగా చిత్రాల్లో నటించాడు. ఇందులో మూడు నాలుగు హిట్ చిత్రాలు ఉన్నాయి. సక్సెస్ రేటు తక్కువగా ఉన్నా ఇటీవల అతడు ప్రతిభకు సానబట్టి కొత్త రూట్ లో వెళ్లేందుకు సిద్ధమయ్యాడు. రెగ్యులర్ కంటెంట్ తో కాకుండా కొత్తగా ప్రయోగాలు చేయాలన్న తపన అతడికి ఉన్న ప్రత్యేకత.
ఇటీవలే 118 చిత్రంతో ప్రయోగం చేశాడు. కమర్షియల్ సక్సెస్ సంగతి అటుంచితే ఈ సినిమాలో అతడి నటనకు మంచి పేరొచ్చింది. ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ చిత్రాలతో బిజీగా ఉన్నాడు. అతను త్వరలో మల్లిడి వేణుతో కలిసి పని చేయనున్నాడని తెలుస్తోంది. ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ లో ఈ సినిమాని నిర్మించనున్నాడు. ఈపాటికే సినిమా ప్రారంభం కావాల్సి ఉన్నా మహమ్మారీ బిగ్ బ్రేక్ వేసింది.
అలాగే `డిస్కో రాజా` ఫేం వీఐ ఆనంద్ కి ఓ కమిట్ మెంట్ ఇచ్చాడు. ఇప్పటికే స్క్రిప్ట్ పనులు ఇటీవల పూర్తయ్యాయి. కల్యాణరాముని నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చేసిందట. అయితే ఈ మూవీకి కూడా మహమ్మారీ వల్ల బ్రేక్ పడింది. ప్రస్తుత సన్నివేశం చూస్తుంటే.. 2021లోనే ఇవన్నీ సెట్స్ కెళ్లే వీలుంటుందని భావిస్తున్నారు. అలాగే కళ్యాణ్ రామ్ ఓటీటీలో ప్రవేశించే ఆలోచనతో ఉన్నానని కూడా ఇంతకుముందు ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. మరి దానికి సంబంధించిన అప్ డేట్ తెలియాల్సి ఉందింకా.