Begin typing your search above and press return to search.

తన తండ్రి పాత్రలో రథం నడుపుతాడట

By:  Tupaki Desk   |   9 April 2018 11:30 PM IST
తన తండ్రి పాత్రలో రథం నడుపుతాడట
X
టాలీవుడ్ చరిత్ర రోజు రోజుకి నలుగురు నాలుగు రకాలుగా మాట్లాడుకునే విధంగా వెలిగిపోతోంది. పాజిటివ్ ఆర్ నెగిటివ్ అనే సంగతి పక్కనపెడితే వాళ్ళు తలచుకుంటే ఎలాంటి సినిమా అయినా చేస్తారు అనే టాక్ వచ్చింది. ఇప్పుడు నందమూరి తారకరామారావు గారి బయోపిక్ గురించి కూడా దేశవ్యాప్తంగా అలానే మాట్లాడుకుంటున్నారు. అయితే ఎన్టీఆర్ జీవితంలో జరిగిన సంఘటనలు గురించి అందరికి తెలిసిందే.

అయితే ఆయన కుమారుడు చంద్రబాబు వియ్యంకుడు అయిన బాలకృష్ణ ఏ తరహాలో సినిమా ఉండేలా చూసుకుంటాడు అనేది అసలు అంశం. అందరు ఆ విషయం గురించే ఎక్కువగా మాట్లాడుకుంటున్నారు. ఇక అసలు మ్యాటర్ లోకి వస్తే.. ఎన్టీఆర్ చిత్రంలో కళ్యాణ్ రామ్ ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది. ఆయన తండ్రి హరికృష్ణ పాత్రలోనే కనబడతారట. ఎందుకంటే ఎన్టీఆర్ సీఎం అవ్వకముందు హరికృష్ణ తన ఆలోచనలతో పార్టీను ముందుకు తీసుకువెళ్లారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా చైతన్య రథంను సక్సెస్ చేశారు.

ఎన్టీఆర్ జీవితంలో అది చాలా కీలకం. అందుకే దర్శకుడు తేజ హరికృష్ణ పాత్రలో కళ్యాణ్ రామ్ ను ఫిక్స్ చేశాడు. ఇక నారా రోహిత్ - తారక రత్న కూడా సినిమాలో ఛాన్స్ కొట్టేసే అవకాశం ఉండవచ్చు. ఎవరు నటించినా యంగ్ టైగర్ ఎన్టీఆర్ మాత్రం బయోపిక్ లో కనిపించడని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. బాలకృష్ణ నిర్మిస్తున్న సినిమా కావడంతో ఆయనకు నచ్చిన నటీనటులనే సెలెక్ట్ చేసుకుంటున్నారు. మరి నందమూరి అభిమానులు ఈ విషయంలో ఎలా ఆలోచిస్తారో చూడాలి.