Begin typing your search above and press return to search.

సినిమాల్లోలా ఈమెకు లవ్‌ మ్యారేజ్‌ కావాలట

By:  Tupaki Desk   |   25 Feb 2020 3:42 PM IST
సినిమాల్లోలా ఈమెకు లవ్‌ మ్యారేజ్‌ కావాలట
X
నాన్న ప్రముఖ దర్శకుడు.. అమ్మ ప్రముఖ నటి అవ్వడంతో కళ్యాణి ప్రియదర్శన్‌ ఇండస్ట్రీలోకి ఈజీగానే ఎంట్రీ ఇచ్చింది. ‘హలో’ చిత్రంతో తెలుగులో ఈ అమ్మడు పరిచయం అయ్యింది. మొదటి సినిమా నిరాశ పర్చడంతో తెలుగులో ఆశించిన స్థాయిలో ఈమెకు గుర్తింపు రాలేదు. దాంతో సొంత భాష మలయాళం మరియు తమిళంలో కూడా సినిమాలు చేస్తోంది. తెలుగుతో పోల్చితే అక్కడ ఈమె కెరీర్‌ కాస్త ఆశాజనకంగా ఉందని చెప్పుకోవచ్చు. తమిళం మరియు మలయాళంలో పెద్ద సినిమాలు చేసింది.

తాజాగా ఈమె ఒక మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూ లో తన పెళ్లి గురించి క్లారిటీ ఇచ్చింది. తాను ప్రేమ వివాహం చేసుకోబోతున్నట్లుగా ప్రకటించింది. అయితే ఇప్పటి వరకు తాను ప్రేమ లో పడలేదు అని మాత్రం చెప్పింది. పెళ్లి కోసం ప్రకటన ఇవ్వాల్సిన అవసరం నాకు లేదు. ఎందుకంటే నేను ఎప్పటికి అయినా ప్రేమ వివాహమే చేసుకుంటాను. నా ప్రేమ వివాహం.. నా లవ్‌ స్టోరీ లవ్‌ సినిమాల తరహా లో ఉండాలని కోరుకుంటున్నట్లుగా ఈ అమ్మడు చెప్పుకొచ్చింది.

కళ్యాణి ప్రియదర్శన్‌ తన తండ్రి ప్రియదర్శన్‌ దర్శకత్వం లో ఇప్పటికే ఒక సినిమాను చేసింది. ఆ సినిమా సమయంలో చాలా టెన్షన్‌ పడ్డట్లుగా చెప్పుకొచ్చింది. మరోసారి ఆయన దర్శకత్వంలో చేయాలనుకోవడం లేదు. ఎందుకంటే నన్ను డైరెక్ట్‌ చేస్తున్న సమయంలో నాన్న చాలా టెన్షన్‌ పడుతున్నారు. అందుకే మళ్లీ నేను ఆయన దర్శకత్వంలో చేయాలనుకోవడం లేదంది.

ఇక తల్లితో కలిసి ఇటీవల ఒక యాడ్‌ షూట్‌ లో పాల్గొంది. అమ్మ తో కలిసి నటించడం చాలా ఆనందాన్ని ఇచ్చింది. అమ్మ కూడా నాతో నటించడంను ఎంజాయ్‌ చేసింది. ప్రస్తుతం నా కెరీర్‌ తో పూర్తి సంతృప్తిగా ఉన్నట్లుగా చెప్పింది.