Begin typing your search above and press return to search.

శర్వాతో హలో బ్యూటీ?

By:  Tupaki Desk   |   2 Feb 2018 5:46 AM GMT
శర్వాతో హలో బ్యూటీ?
X
టాలీవుడ్ క్లిక్ అయితే చాలు హీరోయిన్స్ బిజీ అవ్వడం కామన్ అనే ఫార్ములా చాలా మంది మోడల్స్ కి తెలుసు అందుకే ఇక్కడ ఉన్నన్ని రోజులు సినిమాలను చాలా స్పీడ్ గా చేసేస్తుంటారు. ఇక ఆ తరువాత సౌత్ మొత్తం తిరిగేస్తుంటారు. అయితే అదే తరహాలో ప్రముఖ దర్శకుడు ప్రియదర్శన్ మరియు మాజీ నటి లిసీ కూతురు కళ్యాణి కూడా కొంచెం బిజీ అయ్యేలా కనిపిస్తోంది. హలో అనుకుంన్నంత రేంజ్ లో హిట్ అవ్వకపోయినప్పటికి హీరోయిన్ కళ్యాణి ప్రియదర్శిన్ కి మాత్రం బాగానే కలిసొచ్చింది.

సింపుల్ గా హోమ్లీ గర్ల్ గా కనిపించేటప్పటికి కొంత మంది కుర్ర హీరోల సరసన కరెక్ట్ గా సెట్ అవుతుందనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. హలో సినిమాలో ఆమె నటనకు మంచి మార్కులే పడ్డాయి. అయితే ఇప్పుడు అమ్మడు ఫెస్టివల్ హీరో శర్వానంద్ తో జాతకట్టనుందని తెలుస్తోంది. త్వరలోనే సుదీర్ వర్మ శర్వా తో ఒక సినిమాను స్టార్ట్ చేయనున్నాడు. అయితే అందులో మొదట కాజల్ అగర్వాల్ ని అలాగే నిత్యా మీనన్ ని అనుకున్నారు.

అయితే నిత్యా మీనన్ వేయుట్ లాస్ కి సంబంధించి తేడా రావడంతో ఆమెను పక్కన పెట్టాడట దర్శకుడు. ఇక ఆ పాత్రకు సాయి పల్లవి గురించి ఆలోచించగా శర్వా హను రాఘవపూడి దర్శకత్వంలో ఆల్ రెడీ నటిస్తోంది కాబట్టి వేరే హీరోయిన్ ని తీసుకుంటే బెటర్ అని ఆలోచిస్తుండగా హలో బ్యూటీ ఆ పాత్రకు కరెక్ట్ గా సెట్ అవుతుందని నిర్మాతలు కూడా చర్చించడంతో సుదీర్ దాదాపు ఫైనల్ చేసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనుల్లో ఉన్న ఆ ప్రాజెక్టు మరికొన్ని రోజుల్లో స్టార్ట్ అవ్వనుంది.