Begin typing your search above and press return to search.

ప‌ల్లెటూరి ప‌డుచుగా హ‌లో పిల్ల‌

By:  Tupaki Desk   |   18 April 2018 4:56 PM GMT
ప‌ల్లెటూరి ప‌డుచుగా హ‌లో పిల్ల‌
X
రంగ‌స్థ‌లం 1980ల నాటి క‌థ‌తో విడుద‌లై సూప‌ర్ హిట్ కొట్టింది. ఇప్పుడు ఆ కాలం నాటి క‌థ‌తో మ‌రో సినిమా సిద్ధ‌మ‌వుతోంది. 80ల‌నాటి గ్యాంగ‌స్ట‌ర్ క‌థ‌తో సుధీర్ వ‌ర్మ సినిమా తీస్తున్నాడు. క‌థంతా విలేజ్ బ్యాక్‌ డ్రాప్ లో నే ఉంటుంద‌ట‌. ఇందులో తొలిసారి హ‌లో బ్యూటీ క‌ళ్యాణి ప్రియ‌ద‌ర్శ‌న్‌ దేశీ అమ్మాయిగా క‌నిపించ‌బోతోంది. అదేనండి లంగావోణీలు వాలుజ‌డ‌ల‌తో ద‌ర్శ‌న‌మివ్వ‌బోతోంది.

హ‌లో సినిమాతో తెరంగేట్రం ఇచ్చింది క‌ళ్యాణి ప్రియ‌ద‌ర్శ‌న్‌. ఆ సినిమా బాక్సాఫీసు ద‌గ్గ‌ర బోల్తాప‌డింది. ఇప్పుడు సుధీర్ వ‌ర్మ ద‌ర్శ‌క‌త్వంలో శ‌ర్వానంద్‌ కు జోడీగా న‌టిస్తోంది. త‌న క్యారెక్ట‌ర్ గురించి కొంత చెప్పుకుంటూ వ‌చ్చింది క‌ళ్యాణి. తాను ఆ సినిమాలో ప‌ల్లెటూరి అమ్మాయిగా క‌నిపించ‌బోతున్నాన‌ని అది త‌న‌కు చాలా ఆనందాన్ని ఇస్తోందంటూ మురిసిపోయింది. త‌న తండ్రి కూడా ఆ లుక్‌ లో త‌న‌ను చూసేందుక ఉవ్విళ్లూరుతున్నాడ‌ని అంది. సుధీర్ వ‌ర్మ త‌న‌కు చాలా మంచి పాత్ర ఇచ్చాడ‌ని చెప్పుకొస్తోంది. సినిమాలో త‌న లుక్ పూర్తిగా మార్చేందుకు హైద‌రాబాద్‌ కు చెందిన స్టైలిస్టు అశ్విన్ ద‌ర్శ‌కుడు సుధీర్ వ‌ర్మ చాలా క‌ష్ట‌ప‌డ్డార‌ని అంటోంది.

ఇంకా పేరు పెట్ట‌ని ఈ సినిమా షూటింగ్ కాకినాడ విశాఖ‌పట్నం ప్రాంతంలో జ‌రిగింద‌ని త్వ‌ర‌లో హైద‌రాబాద్‌ లో జ‌ర‌గ‌నుంద‌ని చెప్పింది హ‌లో బ్యూటీ. మొద‌టి రోజు షూటింగ్ వెళ్లిన‌ప్పుడు టీమ్ అంతా కొత్త‌వారే కావ‌డంతో చాలా ఇబ్బందిగా అనిపించింద‌ని ... వారు త‌న‌కు స‌ర్‌ ప్రైజ్ బ‌ర్త్ డే పార్టీ ఏర్పాటు చేశార‌ని అంద‌రూ ఫ్రెండ్స‌యిపోయారని అంటోంది. హైద‌రాబాద్‌ లో జ‌రిగే షూటింగ్ షెడ్యూల్ కోసం ఎదురుచూస్తున్న‌ట్టు చెప్పింది. ఆమె పాత్ర గురించి అడిగితే కళ్ల‌తోనే ఎన్నో భావాలు ప‌లికించే మంచి పాత్ర ఇచ్చార‌ని సుధీర్ వ‌ర్మ చెప్పిన‌ట్టు న‌టిస్తున్నాన‌ని చెప్పింది. అంత‌కుమించి ఆ పాత్ర గురించి ఇంత కూడా స‌మాచారం చెప్ప‌కుండా జాగ్ర‌త్త ప‌డింది పాప‌.