Begin typing your search above and press return to search.

ఛలో హీరోకు హలో భామ

By:  Tupaki Desk   |   13 April 2018 7:47 AM GMT
ఛలో హీరోకు హలో భామ
X
హీరో నాగశౌర్యకు షాకింగ్ సక్సెస్ ఇచ్చిన ఛలో తర్వాత అతను చేస్తున్న కొత్త సినిమా @నర్తనశాల. పాత క్లాసిక్ కి దీనికి ఎలాంటి సంబంధం లేదని కేవలం టైటిల్ మాత్రమే వాడుకున్నామని దీనికి దర్శకత్వం వహిస్తున్న చక్రవర్తి స్పష్టం చేస్తున్నాడు. అతనికి ఇదే మొదటి సినిమా. దీని రెగ్యులర్ షూటింగ్ ప్రారంభమయ్యింది. నిజానికి ఇందులో హీరొయిన్ గా తొలుత మెహ్రీన్ ని అనుకున్నారు. ఆమేరకు చర్చలు కూడా జరిగాయని కాని రెమ్యునరేషన్ దగ్గర మెహ్రీన్ కొద్దిగా బెట్టు చేయటం వల్ల వేరే ఆప్షన్ చూసుకుంటున్నారని గతంలో వార్తలు వచ్చాయి. వాటిని నిజం అనిపించేలా ఇప్పుడు ఇందులో మెహ్రీన్ కి బదులు హలో ఫేం కళ్యాణి ప్రియదర్శన్ ను తీసుకోవడం హాట్ టాపిక్ గా మారింది. షూటింగ్ ప్రారంభానికి ముందే ఈ మార్పు జరగడం ఆశ్చర్యం కలిగించే విషయమే.

నిజానికి నాగ శౌర్యకు హీరొయిన్స్ తో అంతగా పొత్తు కుదరడం లేదు అనిపిస్తోంది. కణం సినిమా గురించి సాయి పల్లవి మీద ఒక న్యూస్ ఛానల్ ఇంటర్వ్యూలో కొన్ని ఆరోపణలు చేసిన నాగ శౌర్య ఆ ఆ మూవీ ప్రమోషన్ విషయంలో యాక్టివ్ గా లేడని మీడియాలో కూడా ప్రచారం జరిగింది. ఇప్పుడు మెహ్రీన్ తో అండర్ స్టాండింగ్ కుదరకపోవడానికి కారణం అలాంటిదేనా అనే చర్చ మళ్ళి మొదలైంది. హలో అంతగా ఆడకపోయినా కళ్యాణి ప్రియదర్శన్ శర్వానంద్ సినిమాలో ఛాన్స్ కొట్టేసింది. ఇప్పుడు శౌర్యతో కూడా జట్టు కట్టింది. ఒకవేళ రవితేజ-గోపి చంద్ లాంటి సీనియర్ హీరోలతో నటించిన మెహ్రీన్ కన్నా ఫ్రెష్ గా అనిపించే కళ్యాణికి శౌర్య ఓటు వేసాడేమో అని మరో టాక్ ఉంది.

గతంలోనే ఒక ఇంటర్వ్యూలో తన సినిమాల విషయాల్లో ప్రతి దాంట్లో కాలు వేలుతో అన్ని పెడతానని పరాజయాలు తనకు గుణపాఠం నేర్పాయని చెప్పిన నాగ శౌర్య దాన్ని గట్టిగానే ఫాలో అవుతున్నట్టు ఉన్నాడు. @నర్తనశాల కూడా స్వంత బ్యానర్ ఐరా లోనే రూపొందుతోంది. అవుట్ అండ్ అవుట్ ఎంటర్ టైనర్ గా రూపొందుతున్న ఈ మూవీ దసరా లోపు ఫినిష్ చేసి విడుదలకు ప్లాన్ చేస్తున్నారు