Begin typing your search above and press return to search.

హలో కళ్యాణి... ఐ హేట్ యూ

By:  Tupaki Desk   |   25 Dec 2017 4:23 AM GMT
హలో కళ్యాణి... ఐ హేట్ యూ
X
హలో సినిమాతో వెండితెరపై మొదటిసారి మెరిసిన అందం కళ్యాణి. ఈమె తండ్రి ఫేమస్ బాలీవుడ్ - మళయాళ సినిమాల డైరెక్టర్ ప్రియదర్శన్.. తల్లి ఒకప్పటి అందాల నటి లిజి. అమ్మానాన్నలిద్దరూ సినిమా రంగానికి చెందినవారే కావడంతో తొలిసినిమాతోనే యాక్టింగ్ శభాష్ అనిపించుకుంది. దీంతో ఆమెకు ఇప్పుడు ఐ హేట్ యూ మెసేజ్ లు వెల్లువలా వచ్చిపడిపోతున్నాయి. అభిమానులే కాదు.. సెలబ్రిటీలు కూడా ఆమెకు వరసగా ఐ హేట్ యూ చెబుతున్నారు.

తనకొస్తున్న మెసేజీలు చూసి కళ్యాణి ఉబ్బితబ్బిబ్బయిపోతోంది. ఐ హేట్ యూ అంటే బాధపడాలి కానీ సంతోషించడమేంటి అనిపించిందా.. ఆమెకు విషెస్ చెప్పిన వారంతా ‘హలో’ సినిమాలోని కాన్సెప్ట్ అప్లయ్ చేశారు. అందులో ఐ లవ్ యూ అంటే ఎవరెస్ట్ అంత ప్రేమ. అదే ఐ హేట్ యూ అంటే ఆకాశమంత ప్రేమ. ఎవరెస్ట్ కయినా లిమిట్ ఉంది కానీ ఆకాశానికి ఉండదు కదా. అందుకే నువ్వు మాకంత బాగా నచ్చావు అంటూ అందరూ కాస్త పొయిటిగ్గా హలో సినిమా స్టయిల్ లోనే విషెస్ చెప్పుకొచ్చారు. దీంతో కళ్యాణి అభిమానులందరికీ సోషల్ మీడియా ద్వారా థ్యాంక్స్ కూడా చెప్పింది. ‘‘నాకొస్తున్న ఐ హేట్ యూ మెసీజీలు చూస్తే చెప్పలేనంత సంతోషంగా ఉంది. థాంక్యూ ఆల్ సోసో మచ్. ఇదంతా సాధ్యం అవడానికి కారణమైన డైరెక్టర్ విక్రమ్ కె.కుమార్ కు కూడా థాంక్స్. మీ అందరిలాగే ఐ హేట్ యూ టూ’’ అంటూ తన ఆనందాన్ని పోస్ట్ చేసింది.

అఖిల్ రీ లాంచ్ సినిమాగా ప్రేక్షకుల ముందుకొచ్చిన హలో సినిమా ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటోంది. హీరో అఖిల్ స్టంట్స్.. హీరోయిన్ కళ్యాణి క్యూట్ నెస్.. డైరెక్టర్ విక్రమ్ కుమార్ టేకింగ్.. అన్నీ కలిసి బాక్సాఫీస్ ను బాగానే అట్రాక్ట్ చేస్తున్నాయి.