Begin typing your search above and press return to search.

హ‌లో భామ‌.. ఇంకేం రావ‌మ్మా?

By:  Tupaki Desk   |   21 Dec 2017 2:34 PM GMT
హ‌లో భామ‌.. ఇంకేం రావ‌మ్మా?
X
ఇప్పుడు న‌డ‌స్తోంది డిజిట‌ల్ ప్ర‌పంచం. ఏ అనుష్కో.. త‌మ‌న్నానో..కాజ‌లో త‌మ‌కు ట్విట్ట‌ర్ వాడ‌టం రాదంటే ఓకే అనుకోవచ్చు. ఈ త‌రం చిన్న‌ది హ‌లోఫేం క‌ల్యాణికి ట్విట్ట‌ర్ వాడ‌టం రాద‌ట‌. నిజ‌మో.. అబ‌ద్ధ‌మో కానీ.. తాజాగా ట్విట్ట‌ర్‌ లో పోస్ట్ చేసిన పోస్ట్ తో తానెంత అమాయ‌కురాలో చెప్ప‌క‌నే చెప్పేసిందంటున‌నారు.

అఖిల్‌ తో జ‌త‌క‌ట్టిన హ‌లో చిత్రం రేపు (శుక్ర‌వారం) విడుద‌ల కానుంది. తాజాగా ట్విట్ట‌ర్ ఖాతాను ఓపెన్ చేసిన ఆమె.. వ‌యోలిన్ వాయిస్తున్న త‌న స్టిల్‌ ను పోస్ట్ చేసింది. ఇక్క‌డ వ‌ర‌కూ బాగానే ఉన్నా.. ఇక్క‌డే ఒక ట్విస్ట్ ఇచ్చింది. త‌న‌కు ట్విట్ట‌ర్ వాడ‌టం ఎలానో రాద‌ని.. ఇప్పుడే తాను నేర్చుకున్నాన‌న్న విష‌యాన్ని చెబుతూ.. స‌రిగానే వాడుతున్నానుగా అంటూ అమాయ‌కంగా అడిగేసింది.

అస‌లే హ‌లో సుంద‌రి.. అమ్మ‌డి మాట‌కు ఆమెను అభిమానించేవారు తెగ మురిసిపోయారు. ముద్దుముద్దుగా తెలీని విష‌యాన్ని ఎంత ఓపెన్ గా చెప్పేసిందంటూ ముచ్చ‌ట‌ప‌డిపోతుంటే.. ఓర్నీ యేషాలో.. ఇప్ప‌టి పిల్ల‌ల‌కు ట్విట్ట‌ర్.. ఫేస్ బుక్‌.. లాంటివి వాడ‌టం రాకుండా ఉంటాయా అంటూ రాగాలు తీస్తున్నారు. ట్విట్ట‌ర్ రాదు ఓకే.. క‌నీసం వాట్సాప్ అన్నా వాడ‌టం వ‌చ్చుగా..?