Begin typing your search above and press return to search.

ఎక్స్ క్లూసివ్ : తుపాకీ డాట్ కామ్ తో కళ్యాణి ప్రియదర్శిని స్పెషల్ చిట్ చాట్

By:  Tupaki Desk   |   12 Aug 2019 12:19 PM GMT
ఎక్స్ క్లూసివ్ : తుపాకీ డాట్ కామ్ తో కళ్యాణి ప్రియదర్శిని స్పెషల్ చిట్ చాట్
X
* హాయ్ కళ్యాణి గారు, ఫిల్మ్ బ్యాగ్రౌండ్ నుంచి ఫిలిమ్స్ లోకి వచ్చారు, మీ నాన్న గారు ఫ్యాన్ ఇండియా వైడ్ ఫేమస్, మరి మీరు తెలుగు లోనే లాంచ్ ఐయ్యారు ఎందుకని?

మీరు మా నాన్న గురించి చెప్పారు, కానీ మా అమ్మ కూడా ప్రముఖ నటి, ఆమె ప్రోత్సహంతోనే నేను తెలుగు లోకి అడుగుపెట్టాను, నిజానికి సినిమాలు వైపు అమ్మ నన్ను పుష్ చేసినట్లు గా నాన్న చేయలేదు, కానీ సినిమాలోకి రావాలి అని చెప్పినప్పుడు మాత్రం నాకు చాలా సూచనలు చేశారు. అయన చెప్పిన ప్రతి మాటని నేను ఇక్కడ తూచా తప్పకుండ పాటిస్తున్నా..

* ఎందుకని ఈ నెక్స్ట్ డోర్ అమ్మాయి రొల్స్ యే చేస్తున్నారు, మిమల్ని చూస్తే అలానే అనిపిస్తారు అని ఏమైనా ఉద్దేశంతో ఈ రొల్స్ సెలెక్ట్ చేస్తున్నారా, మొనాటనీ వస్తుందేమో అని భయం వేయడం లేదా?

(కొంత షాక్ లుక్ తో) మొనాటనీ గురించి ఒక సారి కూడా ఇప్పటి వరకు ఆలోచించలేదు, నిజానికి మీరు అడిగినట్లు గా ఒకే టైపు రొల్స్ చేస్తున్న అనే ఆలోచన నాకు పెద్దగా రాలేదు ఎందుకంటే నేను నటించిన మూడు సినిమాల్లో, నా రొల్స్ చాలా డిఫరెంట్ గా ఉంటాయి, రణరంగం లో క్యారెక్టర్ ఐతే నాకు మంచి పేరు తెస్తుంది అని నేను బలం గా నమ్ముతున్న.

* రణరంగం లో మీ క్యారెక్టర్ గురించి చెప్పండి?

రణరంగం నేను ఓ పల్లెటూరి అమ్మాయి లా నటించాను, కథ ప్రకారం నేను హీరో కి ఓ లవ్ ఇంట్రెస్ట్, కానీ నా వల్ల హీరో కొన్ని ఇబ్బందులు పడతాడు. వాటికీ నేను ఎలా కారణం అయ్యాను, నాకు హీరోకి అసలు సంబంధం ఏంటి అనే ట్విస్ట్స్ తో నా రోల్ ని ఈ సినిమా లో అద్భుతంగా డిజైన్ చేశారు డైరెక్టర్ సుధీర్, ఇప్పటి వరకు నేను పని చేసిన డైరెక్టర్స్ అందరిలో సుధీర్ ది కూలెస్ట్ డైరెక్టర్, అందుకే ఈ సినిమా మొత్తం చాలా సరదాగా సాగిపోయింది.

* మీరు ఎన్ని రొల్స్ చేసిన, మీ మొదటి సినిమాల్లో చేసిన జున్ను పాత్ర ఎప్పటికి మీతోనే వస్తూ ఉంటుంది, ఆ జున్ను రోల్ క్రెడిట్ ఎవరికీ ఇస్తారు..?

మరో మాట లేదు, ఆ క్రెడిట్ మొత్తం డైరెక్టర్ కే ఇస్తాను, ఆ రేంజ్ రోల్ అది, దానికోసం నేను పడ్డ శ్రమ మళ్ళీ పడనేమో, ఎందుకంటే అంతలా జున్ను పాత్ర నన్ను ప్రభావితం చేసింది. ఆ ఇంపాక్ట్ ఇంకా నా పైన నా నటన పైన ఉంది..

* రణరంగం లో మీరు నటించిన రోల్ మీ కెరీర్ కి ఎలా ఉపయోగపడుతుందని, మీరు భావిస్తున్నారు?

ఈ రోల్ నాకు నచ్చింది కాబట్టి , నన్ను గంగ క్యారెక్టర్ లో ఆడియన్స్ రిసీవ్ చేసుకుంటారు అని నమ్మను కాబట్టి ఈ సినిమా కి సైన్ చేశాను, నా ముందు సినిమాలు కూడా ఇదే లెక్కలో లో చేశాను, కానీ నెక్స్ట్ ఏం అవుతుంది అనే ప్రశ్న కి నా దగ్గర ఇప్పుడు జవాబు లేదు. సినిమా రిలీజ్ తరువాత చూడాలి.

* మీరు గోల్డెన్ స్పూన్ బోర్న్, మరి పల్లెటూరు అమ్మాయి రోల్ మీకు సెట్ అవుతుందా అని అనుకున్నారా?

నటన కి నా బ్యాక్ గ్రౌండ్ కి ఎలాంటి సంబంధం లేదు అండి. నటన వేరు నా పర్సనల్ విషయాలు వేరు, నాకున్న సినిమా నేపథ్యం కేవలం నాకు సినిమా కష్టాలు తెలియకుండా ఎంట్రీ వచ్చేలా చేసింది, కానీ ఇక్కడకు వచ్చాక మాత్రం నా టాలెంట్ తోనే నేను ముందుకు వెళ్తున్న, నేనే కాదు నా లాంటి గోల్డెన్ స్పూన్ బార్న్స్ అందరు సినిమాల్లోకి వచ్చాక వాళ్ళ టాలెంట్ తోనే పేరు తెచ్చుకుంటున్నారు..

* మీ టాలెంట్ తో మీరు మరింత మంచి పేరు తెచ్చుకోవాలని, రణరంగం తో మీకు హ్యాట్రిక్ హిట్ రావాలని మనస్ఫూర్తిగా మా తుపాకీ డాట్ కామ్ కోరుకుంటుంది, అల్ ది బెస్ట్

థాంక్ యూ, ఈ ఇంటర్వ్యూ చదివిన రీడర్స్ అందరు దయ చేసి థియేటర్ కి వెళ్లి మా సినిమా ను చూసి ఎంజాయ్ చేయండి, ప్లీజ్ కిల్ పైరసీ