Begin typing your search above and press return to search.

నాన్నగారి పాత్రకు పాతిక రోజుల కాల్ షీట్స్

By:  Tupaki Desk   |   15 Sept 2018 11:59 AM IST
నాన్నగారి పాత్రకు పాతిక రోజుల కాల్ షీట్స్
X
నందమూరి బాలకృష్ణ లెజెండరీ ఎన్టీఆర్ బయోపిక్ షూటింగ్ తో బిజీగా ఉన్నాడు. క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో పలువురు ఇతర టాలీవుడ్ హీరోలు.. నటులకు కీలక పాత్రలలో కనిపిస్తారు. ఈ సినిమాలో చైతన్య రథసారథి అయిన నందమూరి హరికృష్ణ పాత్రలో అయన కుమారుడు కళ్యాణ్ రామ్ నటిస్తాడని ఇప్పటికే వార్తలు వచ్చాయి. మరో రెండు రోజుల్లో కళ్యాణ్ రామ్ 'ఎన్టీఆర్ షూటింగ్ లో జాయిన్ అవుతాడని సమాచారం.

తన పాత్రకు సంబంధించి ఎన్టీఆర్ టీమ్ కు 25 రోజుల కాల్ షీట్స్ ఇచ్చాడట కళ్యాణ్ రామ్. ఈ సెప్టెంబర్ 17 న అంటే సోమవారం నుండి షూటింగ్ లో పాల్గొంటాడట. నందమూరి హరికృష్ణ ఆకస్మిక మరణం నుండి ఇంకా నందమూరి కుటుంబం తేరుకోలేదు. ఇలాంటి సమయంలో నాన్నగారి పాత్రలో నటించడం కళ్యాణ్ కు ఒక ఎమోషనల్ అయ్యే సందర్భం. మొదట బాలకృష్ణ - కళ్యాణ్ రామ్ కలిసి నటించే చైతన్య రథం సన్నివేశాలను తెరకెక్కించేందుకు క్రిష్ ప్లాన్ చేసుకున్నాడట.

ఇదిలా ఉంటే కళ్యాణ్ రామ్ కేవీ గుహన్ దర్శత్వంలో తెరకెక్కుతున్న ఒక థ్రిల్లర్ సినిమాలో కూడా నటిస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ త్వరలో పూర్తి కానుందని సమాచారం. ఈ సినిమాను డిసెంబర్ లోపు ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తారట.