Begin typing your search above and press return to search.

ఎన్టీఆర్‌ ను చూసి భయపడొద్దు-కళ్యాణ్ రామ్

By:  Tupaki Desk   |   26 Sept 2017 10:39 AM IST
ఎన్టీఆర్‌ ను చూసి భయపడొద్దు-కళ్యాణ్ రామ్
X
‘జై లవకుశ’ విషయంలో తన తమ్ముడు జూనియర్ ఎన్టీఆర్ నటనకు సంబంధించి తాను విడుదలకు ముందు అన్న మాటలే నిజమయ్యాయని అన్నాడు నందమూరి కళ్యాణ్ రామ్. ఎన్టీఆర్ తప్ప ఇంకెవరూ ‘జై లవకుశ’లోని మూడు పాత్రల్ని అంత బాగా చేయలేరని తాను అన్నానని.. ఇప్పుడు ప్రేక్షకులు ఇదే మాట అంటున్నారని కళ్యాణ్ రామ్ చెప్పాడు. తన తమ్ముడి గురించి తాను ఎక్కువ మాట్లాడకూడదని.. అతడి గురించి మాట్లాడాల్సి వస్తే దిష్టి తగులుతుందేమో అని తనకు భయంగా ఉందని అన్నాడు కళ్యాణ్ రామ్. అయినప్పటికీ అతణ్ని పొగడకుండా ఉండలేనని.. అతను ఈ సినిమాలో ఎక్స్ ట్రార్డినరీగా చేశాడని అన్నాడు కళ్యాణ్ రామ్.

‘జై లవకుశ’ సినిమా విడుదలయ్యాక ఒకరు తనతో ఎన్టీఆర్ గురించి అన్న మాటను కళ్యాణ్ రామ్ ప్రస్తావించాడు. జై పాత్రలో అంత బాగా నటించాక.. మళ్లీ దీన్ని మించిన పాత్ర అతడికి వస్తుందా.. దర్శకులు అతడికి ఇంకేదైనా పాత్ర ఇవ్వడానికి భయపడరా అని సందేహం వ్యక్తం చేశాడని.. ఐతే ఎన్టీఆర్ విషయంలో అలాంటి భయాలేమీ పెట్టుకోవద్దని కళ్యాణ్ రామ్ అన్నాడు. తన తమ్ముడు ఎలాంటి పాత్రనైనా చేయగలడని.. పాత్ర గురించి చెబితే చాలు.. దాని మీద ఒక్కడే కూర్చుని చాలా హోమ్ వర్క్ చేస్తాడని.. డైలాగ్ ఎలా చెప్పాలి.. మేకప్ ఎలా ఉండాలి.. హేర్ స్టైల్ సంగతేంటి.. ఇలా అన్ని విషయాలూ ఆలోచిస్తాడని.. అతను మున్ముందు మరిన్ని మంచి పాత్రలు చేయాలని తాను కోరుకుంటున్నానని.. కాబట్టి దర్శకులు నిరభ్యంతరంగా కొత్త పాత్రలతో అతడి దగ్గరికి రావాలని కోరాడు కళ్యాణ్ రామ్.