Begin typing your search above and press return to search.

ఆగష్టులో కిక్కిచ్చి సెప్టెంబర్‌లో గర్జన

By:  Tupaki Desk   |   10 July 2015 3:43 PM IST
ఆగష్టులో కిక్కిచ్చి సెప్టెంబర్‌లో గర్జన
X
పటాస్‌ విజయం తర్వాత కళ్యాణ్‌రామ్‌ జెట్‌స్పీడ్‌తో రేసులోకి వస్తాడని భావించారంతా. కానీ అతడు ప్రణాళికల్లో బోలెడంత జాప్యం జరుగుతోంది. ఇప్పటికే అతడు నిర్మిస్తున్న కిక్‌2 రిలీజ్‌ చేయాల్సింది. కానీ ఆ సినిమా ఎప్పుడొస్తుందో క్లారిటీ రాలేదింతవరకూ. అలాగే షేర్‌ సినిమాని చాలా కాలంగా తెరకెక్కిస్తున్నా ఇప్పటికి గానీ చిత్రీకరణ పూర్తి చేసుకుని పోస్ట్‌ ప్రొడక్షన్‌కి రాలేదు. గురుడు ఆలస్యం చేస్తుండడంతో అభిమానుల్లో సైతం గందరగోళం నెలకొంది. అయితే ఈ సైలెన్స్‌కి చెక్‌ పెట్టేస్తూ సరైన సమాధానం సిద్ధం చేసుకున్నాడు ఈ నందమూరి హీరో.

రెండు వరుస నెలల్లో వరుస సినిమాలతో రేసులోకి వచ్చేస్తున్నా అని సిగ్నల్స్‌ ఇచ్చాడు కళ్యాణ్‌రామ్‌. ఆగస్టులో కిక్‌2 సినిమాతో కిక్కిఇచ్చ, సెప్టెంబర్‌లో షేర్‌ తో సింహగర్జన చేస్తా అంటున్నాడు. షేర్‌ చిత్రానికి 'కత్తి' మల్లిఖార్జున్‌ దర్శకత్వం వహిస్తున్నాడు. రవితేజ హీరోగా సురేందర్‌ రెడ్డి దర్శకత్వంలో కిక్‌2 తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. నిర్మాతగా ఈ చిత్రం తనకి పెద్ద బ్రేక్‌ ఇస్తుందని కళ్యాణ్‌రామ్‌ ఆశిస్తున్నాడు. అలాగే షేర్‌తో హీరోగానూ టాప్‌ స్లాట్‌ దక్కించుకోవాలన్న పట్టుదలను కనబరుస్తున్నాడు. షేర్‌లో వన్య మిశ్రా స్థానంలో సోనాల్‌ చౌహాన్‌ని రీప్లేస్‌ చేశాక స్పీడ్‌ పెంచారు. ఇంతకాలం క్లారిటీ మిస్సయినా ఈ వివరాలతో కాస్త క్లారిటీ వచ్చింది.