Begin typing your search above and press return to search.

కళ్యాణ్ రామ్.. ఐదు సినిమాలు

By:  Tupaki Desk   |   8 Dec 2017 10:53 PM IST
కళ్యాణ్ రామ్.. ఐదు సినిమాలు
X
నందమూరి కళ్యాణ్ రామ్ ప్రస్తుతం అంత గొప్ప ఫాంలో ఏమీ లేడు. అతడి చివరి రెండు సినిమాలూ డిజాస్టర్లే. పూరి జగన్నాథ్ తో చేసిన ‘ఇజం’.. అంతకుముందు మల్లికార్జున్ దర్శకత్వంలో నటించిన ‘షేర్’ డిజాస్టర్లయ్యాయి. ఐతే ఈ ఫాంతో సంబంధం లేకుండా అతను ఇప్పుడు వరుసబెట్టి సినిమాలు చేసేస్తున్నాడు. ఆల్రెడీ ఈ నందమూరి హీరో.. ఉపేంద్ర అనే కొత్త దర్శకుడితో ‘ఎమ్మెల్యే’ అనే సినిమాతో పాటు ‘180’ ఫేమ్ జయేంద్ర డైరెక్షన్లో ఇంకో సినిమా చేస్తున్న సం'గతి తెలిసిందే. ఇవి పూర్తయ్యే దశలో ఉండగా.. ఇప్పుడు కళ్యాణ్ రామ్ ఒకటికి మూడు సినిమాలు కమిటైనట్లుగా వార్తలొస్తున్నాయి.

మలయాళంలో సూపర్ హిట్టయిన ‘రామ్ లీలా’ రీమేక్ ప్రపోజల్ కళ్యాణ్ రామ్ ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. ఇది కాక రెండు నిర్మాణ సంస్థలకు కళ్యాణ్ రామ్ కమిట్మెంట్లు ఇచ్చినట్లు సమాచారం. ‘అష్టాచెమ్మా’.. ‘గోల్కొండ హైస్కూల్’.. ‘ఉయ్యాల జంపాల’ లాంటి సినిమాల్లో నిర్మాణ భాగస్వామిగా ఉన్న మల్టీ డైమన్షన్ పిక్చర్స్ అధినేత రామ్మోహన్ ప్రొడక్షన్లో ఒక సినిమాతో పాటు కోన వెంకట్ భాగస్వామ్యంలో తెరకెక్కనున్న మరో సినిమాకు కళ్యాణ్ రామ్ పచ్చ జెండా ఊపాడట. త్వరలోనే వీటికి సంబంధించిన వివరాలు అధికారికంగా వెల్లడవుతాయి. మొత్తానికి ఇంతకుముందు సొంత బేనర్లోనే సినిమాలు చేసుకుంటూ వచ్చిన కళ్యాణ్ రామ్.. ఇప్పుడు ఫ్లాపుల్లో ఉన్న సమయంలో ఇలా వరుస బెట్టి బయటి బేనర్లలో అవకాశాలు అందుకుంటుండటం విశేషమే.