Begin typing your search above and press return to search.

క‌ల్యాణ్ రామ్ 'బింబిసార'కు సీక్వెల్ చేయ‌ట్లేదా?

By:  Tupaki Desk   |   12 Aug 2022 6:38 AM GMT
క‌ల్యాణ్ రామ్ బింబిసారకు సీక్వెల్ చేయ‌ట్లేదా?
X
దాదాసు రెండు నెల‌లుగా హిట్ అనే మాట కోసం యావ‌త్ టాలీవుడ్ మొత్తం ఆస‌క్తిగా ఎదురుచూసింది. మ‌ళ్లీ 'అఖండ‌'కు ముందు ప‌రిస్థితులే పున‌రావృతం కానున్నాయా? అని తీవ్ర భ‌యాందోళ‌న‌కు గుర‌య్యాయి. మునుప‌టి త‌ర‌హాలో ప్రేక్ష‌కులు ఇక థియేట‌ర్ల‌కు రారా? .. ఓటీటీల‌కే ప‌రిమితం అయిపోతారా? ..థియేట‌ర్ ప‌రిస్థితి ఏంటీ? అని ర‌క ర‌కాల ఆలోచ‌న‌లు.. భ‌యాల‌తో బిక్కు బిక్కు మంటూ గ‌డిపాయి. ఈ నేప‌థ్యంలో ఆగ‌స్టు 5న ప్రేక్ష‌కుల ముందుకొచ్చిన 'బింబిసార‌' మాస్ ని, 'సీతారామం' క్లాస్ ని ఆక‌ట్టుకుని బ్లాక్ బ‌స్ట‌ర్లు గా నిలిచాయి.

అ రెండు సినిమాలు అందించిన స‌క్సెస్ తో టాలీవుడ్ ఒక్క‌సారిగా ఊపిరి పీల్చుకుంది. రెండు సినిమాలు ఒకేసారి విజ‌యాల్ని సొంతం చేసుకోవ‌డంతో కొండంత ధైర్యాన్ని సొంతం చేసుకున్నాయి. ఇదిలా వుంటే నంద‌మూరి క‌ల్యాణ్ రామ్ న‌టించిన పీరియాడిక్ ఫిక్ష‌న‌ల్ మూవీ 'బింబిసార' బాక్సాఫీస్ వ‌ద్ద త‌న ఆధిక్యాన్ని ప్ర‌ద‌ర్శిస్తూ మంచి వ‌సూళ్ల‌ని రాబ‌డుతోంది. ఇండస్ట్రీ వ‌ర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. అయితే ఈ మూవీ రిలీజ్ కు ముందు హీరో క‌ల్యాణ్ రామ్ పార్ట్ 2 కూడా వుంటుంద‌ని స్ప‌ష్టం చేసిన విష‌యం తెలిసిందే.

అంతే కాకుండా హిందీ లో రిలీజ్ చేయ‌డం పై కూడా పలు ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. అంతే కాకుండా మూవీ రిలీజ్ త‌రువాత స‌క్సెస్ ఆనందంలోనూ మీడియాతో 'బింబిసార 2'కు సంబంధించిన సీక్రెట్ ని బ‌య‌ట‌పెట్టారు.

అయితే ముందు నుంచి ఈ మూవీకి సీక్వెల్ అని చెబుతూ వ‌చ్చిన క‌ల్యాణ్ రామ్ సీక్వెల్ కాకుండా ప్రీక్వెల్ ని ప్లాన్ చేస్తున్నార‌ట‌. అంతే కాకుండా పార్ట్ 2 ప్రీక్వెల్ ఐడియాని కూడా బ‌య‌ట‌పెట్టిన‌ట్టుగా తెలుస్తోంది.

'బింబిసార‌'ని మాయా ద‌ర్ప‌ణం, గ‌తం నుంచి వ‌ర్త‌మానానికి వ‌చ్చిన బింబిసారుడు ఎలాంటి ఎమోష‌న్ ల‌కు క‌ట్టుబ‌డ్డాడు.. త‌న త‌మ్ముడి విష‌యంలో ఏం చేశాడ‌న్న‌ది మాత్ర‌మే చూపించారు. అయితే ప్రీక్వెల్ లో మాత్రం బింబిసార ప‌రిణామం, అత‌ని క్రూర‌త్వం, సోద‌రుడితో పోటీ..త‌న తండ్రికి ఏం చేశాడు? ఆ త‌రువాత జ‌రిగిన ప‌రిణామ క్ర‌మంలో అత్యంత క్రూరుడైన రాజుగా ఎలా అవ‌త‌రించాడు? అనే క‌థ‌ని చూపించాల‌నుకుంటున్నార‌ట‌.

ఈ నేప‌థ్యంలో ఫ‌స్ట్ పార్ట్ ని మించి అత్యంత భారీ స్థాయిలో గ్రాండీయ‌ర్ గా భారీ కాన్వాస్ పై తెర‌కెక్కించ‌బోతున్నార‌ట‌. అంతే కాకుండాప్రీక్వెల్ ని హిందీలోనూ రిలీజ్ చేస్తామ‌ని కల్యాణ్ రామ్ క్లారిటీ ఇచ్చేశారు. ఇదే సంద‌ర్భంగా ద‌ర్శ‌కుడు వ‌శిష్ట కూడా ఈ మూవీతో హిందీ ప్రేక్ష‌కుల‌ని సైతం మెప్పిస్తామ‌ని హామీ ఇచ్చాడు. వీరిద్ద‌రి మాట‌ల‌ని బ‌ట్టి చూస్తుంటే 'బింబిసార‌' ప్రీక్వెల్ ని పాన్ ఇండియా వైడ్ గా విడుద‌ల చేయ‌బోతున్న‌ట్టు గా తెలుస్తోంది.