Begin typing your search above and press return to search.

క్లాస్ డైరెక్టర్‌ తో కళ్యాణ్ రామ్

By:  Tupaki Desk   |   19 March 2018 12:39 PM IST
క్లాస్ డైరెక్టర్‌ తో కళ్యాణ్ రామ్
X
కెరీర్ ఆరంభం చాలా వరకు మాస్ మసాలా సినిమాలే చేస్తూ వచ్చాడు నందమూరి కళ్యాణ్ రామ్. కానీ ఈ మధ్య అతడి రూటు మారింది. ‘180’ లాంటి విభిన్నమైన సినిమాతో దర్శకుడిగా పరిచయమైన జయేంద్ర డైరెక్షన్లో ‘నా నువ్వే’ పేరుతో నందమూరి హీరో ఒక క్లాస్ లవ్ స్టోరీ చేస్తున్న సంగతి తెలిసిందే. తాను చేస్తున్న తొలి పూర్తి స్థాయి ప్రేమకథ ఇదే అని కళ్యాణ్ రామ్ ఇది వరకే ప్రకటించాడు. దీని తర్వాత కళ్యాణ్ రామ్ మరో క్లాస్ సినిమా చేయడానికి రెడీ అవుతుండటం విశేషం. ‘ఉయ్యాల జంపాల’.. ‘మజ్ను’ లాంటి ప్రేమకథలు తీసిన విరించి వర్మ దర్శకత్వంలో ఈ నందమూరి హీరో నటించబోతుండటం విశేషం.

విరించితో ‘మజ్ను’ తీసిన ఆనంది ఆర్ట్ క్రియేషన్స్ సంస్థ కళ్యాణ్ రామ్‌ తో అతడి సినిమాను నిర్మించబోతోంది. కళ్యాణ్ రామ్ త్వరలోనే ‘ఎమ్మెల్యే’గా పలకరించబోతున్న సంగతి తెలిసిందే. అతను జయేంద్ర లాంటి దర్శకుడితో జట్టు కట్టడం చూసే చాలామంది ఆశ్చర్యపోయారు. అలాంటి కాంబినేషన్ తెరమీదికి వస్తుందని ఎవ్వరూ ఊహించలేదు. విరించి శైలికి.. కళ్యాణ్ రామ్ స్టైలుకి కూడా చాలా తేడా ఉంది. ఐతే ఇప్పుడు మాస్ సినిమాల హవా తగ్గిపోయి భిన్నమైన క్లాస్ సినిమాలకే ప్రేక్షకులు పట్టం కడుతున్న నేపథ్యంలో తమ్ముడు ఎన్టీఆర్ బాటలోనే తాను కూడా మారాల్సిన అవసరాన్ని కళ్యాణ్ రామ్ గుర్తించినట్లున్నాడు. విరించి సినిమాతో పాటు ఈ ఏడాదే కళ్యాణ్ రామ్ నటించబోయే ఇంకో రెండు చిత్రాలు సెట్స్ మీదికి వెళ్లబోతుండటం విశేషం.