Begin typing your search above and press return to search.

హ్యాపీడేస్ దర్శకుడితో నందమూరి హీరో

By:  Tupaki Desk   |   14 March 2018 10:06 AM IST
హ్యాపీడేస్ దర్శకుడితో నందమూరి హీరో
X

ప్రస్తుతం నందమూరి కళ్యాణ్ రామ్ ఫుల్ స్పీడ్ లో సినిమాలు చేస్తున్నాడు. వరుస సినిమాలను ఓకే చేసేస్తూనే.. డిఫరెంట్ కాన్సెప్టులతో అలరించడానికి ప్రిపేర్ అయిపోయాడు. ఇప్పుడీ హీరో మరో చిత్రానికి సై అన్నాడని తెలుస్తోంది. హ్యాపీడేస్ మూవీతో శేఖర్ కమ్ముల సృష్టించిన సెన్సేషన్ గురించి చెప్పడానికి మాటలు చాలవు.

ఈ చిత్రాన్ని తమిళ్ లో ఇనిదు..ఇనిదు పేరుతో రీమేక్ చేశారు. సినిమాటోగ్రాఫర్ కేవీ గుహన్.. దర్శకుడిగా మారి తమిళ్ హ్యాపీడేస్ ను తెరకెక్కించాడు. ఈ రీమేక్ వెర్షన్ అంతగా ఆడకపోవడంతో.. మళ్లీ గుహన్ దర్శకత్వం వైపునకు వెళ్లలేదు. ఇప్పుడు మరోసారి దర్శకత్వం వహించేందుకు ఈ సినిమాటోగ్రాఫర్ ప్రిపేర్ అయ్యాడు. రీసెంట్ గా కళ్యాణ్ రామ్ ను కలిసి ఓ యాక్షన్ అడ్వంచరస్ మూవీకి స్టోరీ వినిపించాడట. కొన్ని భీకరమైన లొకేషన్స్ లో ఈ షూటింగ్ ఉంటుందని చెప్పాడట. మొదటగా ఈ లొకేషన్స్ ను ఆన్ స్క్రీన్ పై చూపడం సాధ్యమవుతుందా అని ఆలోచించాడట నందమూరి హీరో.

కానీ డైరెక్టర్ కం సినిమాటోగ్రాఫర్ కూడా ఒకరే కావడంతో సరే చెప్పేశాడట. అలా తెలుగులో తన తొలి సినిమాను దర్శకత్వం వహించేందుకు కేవీ గుహన్ కు రంగం ప్రిపేర్ అయిపోతోంది. త్వరలోనే ఈ చిత్రానికి సంబంధించిన ప్రకటన రానుందని తెలుస్తోంది. గుహన్ ఇప్పుడు తన స్క్రిప్ట్ ను ఫైనలైజ్ చేసుకునే పనిలో ఉన్నాడట.