Begin typing your search above and press return to search.
రిలీజ్ కి ముందే ప్రాఫిట్ లో కల్యాణ్ రామ్ మూవీ!
By: Tupaki Desk | 14 July 2022 2:30 AM GMTనందమూరి కల్యాణ్ రామ్ నటించిన భారీ పీరియాడిక్ ఫిక్షన్ మూవీ 'బింబిసార'. ఈ మూవీ ద్వారా మల్లిడి వశిష్ట్ దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ పై హరికృష్ణ కె అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ మూవీని నిర్మిస్తున్నారు. కేథరిన్, సంయుక్త మీనన్ హీరోయిన్ లుగా నటిస్తున్నారు.
5వ శతాబ్దానికి చెందిన మగధ సామ్రాజ్యాధినేత బింబిసారుడి కథతో ఫాంటసీ ఫిక్షన్ గా ఈ మూవీని తెరకెక్కిస్తున్నారు. కరోనా కారణంగా షూటింగ్ అన్ని సినిమాల్లాగే ఆలస్యం అవుతూ వచ్చిన ఈ మూవీ ఎట్టకేలకు పూర్తయింది.
ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటోంది. ఈ నేపథ్యంలో ఇటీవలే ఈ మూవీ టీజర్, ట్రైలర్ లని విడుదల చేశారు. 'బిబిసారుడు అంటేనే మరణ శాసనం' అంటూ హీరో కల్యాణ్ రామ్ చెప్పిన డైలాగ్, బాహుబలి తరహాలో రూపొందిన భారీ సెట్టింగులు, కోటలు, బిబిసారుడి రాజప్రసాదం.. సింహాసనం.. శత్రువుల సైతం భయభ్రాంతులకు గురిచేసే బిబిసారుడి వీర పరాక్రమాలకు సంబంధించిన వీరోచిత విన్యాసాలు వంటి గ్రాడీయర్ విజువల్స్ అబ్బుర పరుస్తున్నాయి.
'మగధీర' తరహాలో సాగే స్క్రీన్ ప్లే తో బిబిసారుడి కాలానికి, నేటి పరిస్థితులకు లింకప్ చేస్తూ దర్శకుడు ఈ సినిమాని ఆద్యంతం ఆసక్తికరంగా భారీ మేకింగ్ వ్యాల్యూస్ తో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు. రీసెంట్ గా విడుదల చేసిన టీజర్, ట్రైలర్ తో ఈ మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి. సర్వత్రా ఆసక్తిని రేకెత్తిస్తున్నఈ మూవీని 50 కోట్లతో నిర్మించారని ప్రచారం జరుగుతోంది. కానీ 36 కోట్ల బడ్జెట్ తో మాత్రమే ఈ మూవీని నిర్మించారు.
తక్కువ బడ్జెట్ తో గ్రాండీయర్ లుక్ ని, అద్భుతమైన విజువల్స్ తో ఈ మూవీని రూపొందించడం విశేషం. ఇదిలా వుంటే ఈ మూవీ రిలీజ్ కి ముందే టేబుల్ ప్రాఫిట్ కి చేరిందని తెలిసింది. 15 కోట్లకు స్టార్ ప్రొడ్యూసర్ తెలంగాణ, ఏపీ థియేట్రికల్ రైట్స్ ని సొంతం చేసుకున్నారట. రిఫండబుల్ విధానంలో ఈ మొత్తం దిల్ రాజు చెల్లించినట్టుగా చెబుతున్నారు. ఇక నాన్ థియేట్రికల్ రైట్స్ పరంగా ఈ చిత్రానికి 22 కోట్లు దక్కినట్టుగా తెలుస్తోంది.
అంటే ఇప్పటికే ఈ మూవీ కోటి ప్రాఫిట్ లో వుందన్నమాట. ఈ రేంజ్ మూవీ ఈ మధ్య కాలంలో రిలీజ్ కి ముందే కోటీ ప్రాఫిట్ ని సొంతం చేసుకోవడం విశేషం అని ట్రేడ్ వర్గాలు అంటున్నాయి. నందమూరి కల్యాణ్ రామ్ భారీ అంచనాలు పెట్టుకున్న ఈ మూవీని ఆగస్టు 12న ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు. త్వరలోనే ప్రమోషన్స్ పరంగా మరింత జోష్ ని పెంచబోతున్నారట.