Begin typing your search above and press return to search.

పుష్ప డైలాగ్ ఫాలో అవుతున్న కళ్యాణ్‌ రామ్

By:  Tupaki Desk   |   1 July 2021 5:30 PM GMT
పుష్ప డైలాగ్ ఫాలో అవుతున్న కళ్యాణ్‌ రామ్
X
నందమూరి కళ్యాణ్‌ రామ్‌ సక్సెస్‌ కోసం సుదీర్ఘ కాలంగా వెయిట్‌ చేస్తున్నాడు. ఆయన సుదీర్ఘమైన కెరీర్‌ లో సక్సెస్‌ లు ఎన్ని అంటే రెండు మూడు మాత్రమే పేర్లు ఉంటాయి. అలాంటి కళ్యాణ్ రామ్‌ కెరీర్‌ లో ఎప్పుడు కూడా తగ్గకుండా బ్యాక్ టు బ్యాక్‌ సినిమాలు చేస్తూనే ఉన్నాడు. ఆయన కెరీర్ లో సక్సెస్ లేకున్నా కూడా ప్రయోగాత్మక సినిమాలు వరుసగా చేస్తూనే ఉన్నాడు. ఆయన ప్రస్తుతం భారీ బడ్జెట్‌ తో బింబిసార సినిమాను చేస్తున్నాడు. పౌరాణిక నేపథ్యంలో రూపొందుతున్న ఆ సినిమా ఫస్ట్‌ లుక్‌ ఇటీవలే విడుదల చేసి అందరి దృష్టిని ఆకర్షించిన కళ్యాణ్ రామ్‌ తాజాగా మరో సినిమా కు కమిట్ అయ్యాడనే వార్తలు వస్తున్నాయి.

ఒక వైపు బింబిసార వంటి భారీ పౌరాణిక సినిమా చేస్తున్న కళ్యాణ్ రామ్‌ మరో వైపు కొత్త దర్శకుడు నవీన్ దర్శకత్వం లో 1950 టైమ్ లోని పీరియాడిక్ స్టోరీ లో కనిపించేందుకు ఓకే చెప్పాడు. బింబిసార తో పాటు సమాంతరంగా ఈ పీరియాడిక్ మూవీని కూడా పట్టాలెక్కించేలా ప్లాన్‌ చేస్తున్నారు. ఈ సినిమా లో అప్పటి స్పై ఏజెంట్‌ గా కళ్యాణ్‌ రామ్‌ కనిపించబోతున్నాడట. ఈ సినిమా కథ చాలా ఇంట్రెస్ట్‌ గా అనిపించడంతో బింబిసార చేస్తున్నా కూడా వెంటనే ఈ సినిమా కు ఓకే చెప్పాడట. ఒకే సమయంలో రెండు భారీ సినిమాలను ఈయన చేస్తూ ఉన్నాడు.

అల్లు అర్జున్‌ తాజా చిత్రం పుష్ప లోని ఫేమస్ డైలాగ్‌ తగ్గేదేలే అన్నట్లుగా కళ్యాణ్ రామ్‌ కూడా సక్సెస్ ప్లాప్ అని చూడకుండా వరుసగా సినిమాలు చేస్తున్నాడు. ప్లాప్‌ లు పడ్డా కూడా తగ్గేదేలే అన్నట్లుగా భారీ సినిమాలు చేయడం కేవలం కళ్యాణ్ రామ్‌ కే చెల్లిందంటూ నెటిజన్స్ కామెంట్స్‌ చేస్తున్నారు. సుదీర్ఘ కాలంగా ప్రయత్నాలు చేస్తున్న ఆయనకు ఈ రెండు సినిమాలు అయినా సక్సెస్ తెచ్చి పెట్టి ఇండస్ట్రీలో నిలదొక్కుకునేలా చేయాలని నందమూరి అభిమానులు కోరుకుంటున్నారను. కళ్యాణ్ రామ్‌ వంటి హీరోలు ప్రయోగాలు చేసేందుకు ఎప్పుడు ముందు ఉంటారు. కనుక అలాంటి వారికి సక్సెస్‌ లు దక్కితే మరిన్ని మంచి సినిమాలు.. కాన్సెప్ట్‌ బేస్డ్‌ సినిమా లను తీసుకు వస్తారని మీడియా సర్కిల్స్ లో టాక్ వినిపిస్తుంది.