Begin typing your search above and press return to search.

తమ్ముడి రాఖీ.. బాబాయి సింహా

By:  Tupaki Desk   |   26 Oct 2016 3:00 PM IST
తమ్ముడి రాఖీ.. బాబాయి సింహా
X
గత కొన్నేళ్లలో తనకు అత్యంత నచ్చిన సినిమా తన బాబాయి బాలయ్య నటించిన ‘సింహా’నే అంటున్నాడు నందమూరి కళ్యాణ్ రామ్. ‘ఇజం’ సినిమాతో ప్రేక్షకుల్ని పలకరించిన నేపథ్యంలో జరిగిన ఓ చిట్ చాట్లో కళ్యాణ్ రామ్ మరిన్ని ఆసక్తికర విషయాలపై మాట్లాడాడు. మీకు బాగా నచ్చిన చిత్రం ఏదని అడిగితే.. ‘‘ఈ మధ్య కాలంలో నాకు థియేటర్లలో గూస్ బంప్స్ ఇచ్చిన సినిమా అంటే.. సింహానే’ అని చెప్పాడు కళ్యాణ్ రామ్.

ఎన్టీఆర్ కెరీర్లో మీకు అత్యంత ఇష్టమైన సినిమా ఏది.. మిమ్మల్ని ఎమోషనల్ గా బాగా కదిలించిన సినిమా ఏది అనే వేర్వేరు ప్రశ్నలకు ‘రాఖీ’ అని బదులిచ్చాడు కళ్యాణ్ రామ్. ‘‘రాఖీలో ఎన్టీఆర్ పెర్ఫామెన్స్ చాలా బాగుంటుంది. ఆ సినిమాలో శ్మశానంలో ఉన్నపుడు తన చెల్లెలి రూపం ఇలా కనిపించి అలా వెళ్లిపోతుంది. ఆ సన్నివేశానికి కళ్లల్లో నీళ్లు వచ్చేశాయి. తమ్ముడి పెర్ఫామెన్స్ కూడా అద్భుతం’’ అని కళ్యాణ్ రామ్ తెలిపాడు.

సీనియర్ ఎన్టీఆర్ సినిమాల్లో ఏదిష్టం అని అడిగితే.. దీనికి ఒక్క మాటలో జవాబు చెప్పడం కష్టమని.. ఐతే మిస్సమ్మ.. గుండమ్మకథ రోజుల్లో తాతయ్య చాలా బాగుంటాడని.. ఆ సినిమాలు చాలా చాలా ఇష్టమని కళ్యాణ్ రామ్ అన్నాడు. తన జీవితంలో ఒకే ఒక్క లవ్ స్టోరీ ఉందని.. అది తన భార్యతోనే అని.. ఐతే పెళ్లి తర్వాతే ఆమెతో ప్రేమలో పడ్డాడని ఒక ప్రశ్నకు సమాధానంగా కళ్యాణ్ రామ్ చెప్పాడు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/