Begin typing your search above and press return to search.

మాస్‌ రాజా 'బింబిసార' చేసి ఉంటే..!

By:  Tupaki Desk   |   6 Jun 2021 11:30 AM GMT
మాస్‌ రాజా బింబిసార చేసి ఉంటే..!
X
నందమూరి కళ్యాణ్ 18వ చిత్రం బింబిసార ఫస్ట్ లుక్ ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. పెద్ద ఎత్తున అంచనాలున్న ఈ సినిమా ను స్వయంగా నిర్మిస్తూ హీరోగా కళ్యాణ్ రామ్‌ నటిస్తున్నాడు. తాజాగా అందుతున్న విశ్వసనీయ సమాచారం ప్రకారం బింబిసార సినిమా లో కీలకమైన పాత్రకు గాను రవితేజ తో కళ్యాణ్ రామ్‌ సంప్రదింపులు జరిపాడు. గతంలో రవితేజ నటించిన కిక్ 2 సినిమాను కళ్యాణ్ రామ్‌ నిర్మించిన విషయం తెల్సిందే. అప్పటి నుండే ఇద్దరి మద్య సన్నిహిత సంబంధాలు కొనసాగుతున్నాయి. ఆ సంబంధంతోనే బింబిసార సినిమా లో రవితేజను నటింపజేసేందుకు కళ్యాణ్‌ రామ్‌ ప్రయత్నించాడు. మొదట ఒప్పుకున్న రవితేజ ఆ తర్వాత నో చెప్పాడు.

రవితేజ హీరోగా వచ్చిన క్రాక్ సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఆ సినిమాకు ముందు ఆయన కెరీర్ ఖతం అయినట్లే అనుకున్నారు. ఆయన సెకండ్‌ ఇన్నింగ్స్ మొదలు పెట్టి విలన్‌ గా మారొచ్చు అనే పుకార్లు షికార్లు చేశాయి. అవి పుకార్లు మాత్రమే కావని ఒకానొక సమయంలో రవితేజ అలాంటి పాత్రలకు ఓకే చెప్పడం కూడా జరిగిందని అంటున్నారు. అందుకు బింబిసార సినిమానే నిదర్శణం అంటున్నారు. క్రాక్‌ సినిమా సమయంలోనే బింబిసార లో నటించేందుకు ఓకే చెప్పిన రవితేజ ఆ సినిమా సక్సెస్‌ అయిన వెంటనే బింబిసార నుండి తప్పుకున్నట్లుగా వార్తలు వస్తున్నాయి.

బింబిసార సినిమా లో ఒక వేళ రవితేజ ఉండి ఉంటే సినిమా పై బజ్‌ మరో విధంగా ఉండేది అనడంలో సందేహం లేదు. హీరోగా కొనసాగుతూనే రవితేజ బింబిసార వంటి భారీ చిత్రాల్లో కీలక పాత్రను చేస్తే ఆయన క్రేజ్ తగ్గిపోదని కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. బింబిసార లో రవితేజ కూడా ఉండి ఉంటే ఖచ్చితంగా సినిమా రేంజ్ మరో లెవల్‌ లో ఉండేది. కాని ఇప్పుడు కేవలం కళ్యాణ్ రామ్‌ మాత్రమే సినిమాను మోయాలంటే కాస్త ఇబ్బందే అంటున్నారు.