Begin typing your search above and press return to search.
రెండు క్రేజీ ప్రాజెక్ట్స్ తో నందమూరి వారసుడు కంబ్యాక్ అయ్యేనా...?
By: Tupaki Desk | 13 Oct 2020 9:30 PM ISTనందమూరి నటవారసుడిగా సినీ ఇండస్ట్రీకి పరిచయమైన కళ్యాణ్ రామ్.. హీరోగా నిర్మాతగా తెలుగు చిత్రసీమలో తనకంటూ ప్రత్యేక ఇమేజ్ క్రియేట్ చేసుకున్నాడు. 'తొలి చూపులోనే' సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చిన కళ్యాణ్ రామ్.. 'అతనొక్కడే' సినిమాతో మంచి విజయాన్ని అందుకున్నాడు. ఆ తర్వాత 'లక్ష్మీ కళ్యాణం' సినిమాతో నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇక 'పటాస్' సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు. ఒకవైపు హీరోగా నటిస్తూనే మరోవైపు ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ లో సినిమాలు నిర్మిస్తూ సక్సెస్ ఫుల్ ప్రొడ్యూసర్ అనిపించుకున్నాడు. అయితే గత కొన్నాళ్లుగా నందమూరి వారసుడికి హీరోగా సరైన హిట్ దక్కడం లేదనే చెప్పాలి. ప్రొడ్యూసర్ గా 'జై లవకుశ' వంటి హిట్ అందుకున్న కళ్యాణ్ రామ్.. హీరోగా 'షేర్' 'ఎమ్మెల్యే' 'ఇజం' 'నా నువ్వే' '118' లాంటి సినిమాలలో నటించినా అవి పెద్దగా తెలుగు ప్రేక్షకులను మెప్పించలేకపోయాయి. ఈ ఏడాది ప్రారంభంలో 'ఎంత మంచివాడవురా' అంటూ సంక్రాంతి బరిలో దిగినా హిట్ మాత్రం దక్కలేదు.
ఈ నేపథ్యంలో ఆచితూచి అడుగులు వేస్తున్న కళ్యాణ్ రామ్ ప్రస్తుతం రెండు ప్రాజెక్ట్స్ లైన్ లో పెట్టుకున్నాడని తెలుస్తోంది. ఎలాగైనా కెరీర్ గ్రాఫ్ మార్చాలని ట్రై చేస్తున్న నందమూరి కళ్యాణ్ రామ్.. వి.ఐ. ఆనంద్ దర్శకత్వంలో హోమ్ బ్యానర్ లో ఓ సినిమా చేయనున్నాడని సమాచారం. 'టైగర్' 'ఎక్కడికి పోతావు చిన్నవాడా' 'ఒక్క క్షణం' 'డిస్కోరాజా' వంటి డిఫరెంట్ కాన్సెప్ట్ సినిమాలతో డైరెక్టర్ ఆనంద్ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నాడు. ఈ క్రమంలో ఇప్పుడు నందమూరి వారసుడిని డైరెక్ట్ చేయబోతున్నాడని తెలుస్తోంది. దీంతో పాటు ఎన్టీఆర్ - త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో తెరకెక్కనున్న సినిమాని హారిక అండ్ హాసిని ఎంటర్టైన్మెంట్స్ వారితో కలిసి కళ్యాణ్ రామ్ నిర్మిస్తున్నాడు. సొంత బ్యానర్ లో రెండు సినిమాలు ప్లాన్ చేసుకున్న కళ్యాణ్ రామ్.. సాలిడ్ హిట్ కొట్టి కంబ్యాక్ అవుతాడేమో చూడాలి.