Begin typing your search above and press return to search.

డిసెంబ‌ర్ రేస్ లో క‌ళ్యాణ్ రామ్ `బింబిసార‌`?

By:  Tupaki Desk   |   18 Nov 2021 8:30 AM GMT
డిసెంబ‌ర్ రేస్ లో క‌ళ్యాణ్ రామ్ `బింబిసార‌`?
X
నంద‌మూరి కళ్యాణ్ రామ్ న‌టిస్తున్న తాజా చిత్రం `బింబిసార`. టైమ్ ట్రావెల్ సోషియో ఫాంటసీ డ్రామా నేప‌థ్యంలో ఆద్యంతం ర‌క్తి క‌ట్టించే కాన్సెప్టుతో ఈ చిత్రం తెర‌కెక్కుతోంది.

నూతన దర్శకుడు మల్లిడి వశిస్ట్ దర్శకత్వం వహిస్తుండగా- భీమ్లా నాయక్ ఫేమ్ సంయుక్త మీనన్ ఈ చిత్రంలో కథానాయిక. చిరంతన్ భట్ సంగీతం అందిస్తున్నారు. ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ పై కళ్యాణ్ రామ్ ఈ ప్రాజెక్ట్ ని నిర్మిస్తున్నారు.

తాజా స‌మాచారం మేర‌కు.. షూటింగ్ లో ఎక్కువ భాగాన్ని సైలెంట్ గా ముగించుకుని థియేటర్లలో విడుదలకు సిద్ధమవుతోంది. బింబిసార డిసెంబర్ బ‌రిలో పోటీకి దిగుతోంది. అయితే విడుదల తేదీని రెండు వారాల్లో ప్ర‌క‌టించ‌నున్నార‌ని తెలిసింది. అఖండ‌- డిసెంబ‌ర్ 2న .. పుష్ప - డిసెంబ‌ర్ 17న .. గ‌ని - డిసెంబ‌ర్ 24న విడుద‌ల‌కు రెడీ అవుతున్న సంగ‌తి తెలిసిందే.

ఆ మూడు సినిమాలు భారీ క్రేజుతో బ‌రిలో దిగుతున్నాయి. ఇప్ప‌టికే అఖండ ట్రైల‌ర్ మాస్ ఫ్యాన్స్ లోకి దూసుకెళ్ల‌గా.. పుష్ప ప్ర‌చార సామాగ్రి వేడి పెంచుతోంది. వ‌రుణ్ తేజ్ గ‌ని లుక్ స‌హా ప్ర‌తిదీ ఆక‌ట్టుకున్నాయి.

కానీ క‌ళ్యాణ్ రామ్ బింబిసార లుక్ పై మ‌రిన్ని అప్ డేట్స్ రావాల్సి ఉంది. ఈ సినిమా ప్రచారం నెమ్మ‌దిగా ఉంది. ఇక‌పై వేగం పెంచి రేసులో ఉన్నామ‌ని చెప్పాల్సి ఉంటుంది. బింబిసార‌ రిలీజ్ తేదీపైనా అధికారికంగా క్లారిటీ వ‌చ్చేస్తే బావుంటుంది.