Begin typing your search above and press return to search.

ఒక్కదెబ్బతో కుదేలైన దర్శకనిర్మాతలు..

By:  Tupaki Desk   |   26 Aug 2015 4:37 AM IST
ఒక్కదెబ్బతో కుదేలైన దర్శకనిర్మాతలు..
X
హీరోగా ఎన్నో ఎదురుదెబ్బలు తిన్న నందమూరి కళ్యాణ్ రామ్ పడిన ప్రతీసారి తనకు తానే ఊతంగా నిలిచి నిలదొక్కుకుంటున్నాడు. కళ్యాన్ రామ్ కెరీర్ లో హిట్లుగా పరిగణించే అతనొక్కడే, హరే రామ్, పటాస్ సినిమాలను అతనే నిర్మించి మంచి నిర్మాతగా పేరుతెచ్చుకున్నాడు.

ఇక తొలిసారిగా ఇతర హీరో సినిమాను భారీ వ్యయంతో నిర్మించి హిట్ కొడదామని కలలు కన్నా కళ్యాణ్ రామ్ కలలు కలలుగానే మిగిలిపోయాయి. ఎన్నో అంచనాల మధ్య విడుదలైన మాస్ మహారాజ్ రవితేజ కిక్ 2 సినిమా ప్రేక్షకులను ఆకర్షించడంలో విఫలమవుతుంది.

కిక్ కున్న క్రేజ్, మంచి పేరున్న డైరెక్టర్, రవితేజకున్న ఎనర్జీ, నిర్మాతకున్న క్యాష్ ఇవేమీ ఈ సినిమాకు బలాన్ని చేకూర్చలేకపోయాయి. రవితేజ కి కెరీర్ బెస్ట్ ఓపెనింగ్స్ వచ్చినా నిర్మాత, దర్శకుడికి మాత్రం అపకీర్తి అంటుకుంది. దీంతో హిట్ బాటలో పయనిస్తున్న ఇద్దరూ ఒకేసారి కుదేలైపోయినట్టు తెలుస్తుంది.