Begin typing your search above and press return to search.
కళ్యాణ్ రామ్.. అది మిస్సయితే కష్టమే..
By: Tupaki Desk | 13 Feb 2023 10:30 AM ISTనందమూరి హీరోల సినిమాలు చాలా వరకు మాస్ కథలుగానే వస్తాయి. అలాంటి మాస్ యాక్షన్, లేదంటే మాస్ ఎంటర్టైనర్ కథలకి నందమూరి ఫ్యాన్స్ ఆసక్తి చూపిస్తూ ఉంటారు. సినిమాలో క్లాస్ టచ్ ఉంది అంటే అలాంటి కథలు చూడటానికి అస్సలు ఇష్టపడరు అనే టాక్ ఫిల్మ్ నగర్ సర్కిల్ లో ఉంది. దీనికి కారణం కూడా ఉంది. బాలయ్య కెరియర్ లో సింహ సినిమా వరకు సరైన హిట్స్ అంటూ ఏవీ లేవు. సినిమాలలో మాస్ టచ్ ఉన్న కూడా టైటిల్స్ విషయంలో క్లాస్ ఉండటంతో నందమూరి ఫ్యాన్స్ పెద్దగా ఆసక్తి చూపించేవారు కాదు.
అందుకే సింహ ముందు వరకు బాలయ్యకి వరుస ఫ్లాప్ లు వచ్చాయి. ఒకానొక దశలో బాలకృష్ణ కెరియర్ ముగిసినట్లే అని అందరూ భావించారు. కనీసం ఓపెనింగ్స్ కూడా రాని పరిస్థితి. అయితే సింహ ఒక్కసారిగా బాలయ్య ఇమేజ్ ని మార్చేసింది. ఆ తరువాత బాలయ్య నుంచి వచ్చిన సినిమాలలో చాలా వరకు అలాంటి పవర్ ఫుల్ మాస్ టైటిల్స్ తో వచ్చి సూపర్ హిట్ అయ్యాయి.
రీసెంట్ గా వచ్చిన వీరసింహారెడ్డి కూడా బాలయ్యని మాస్ హీరోగా ఎలివేట్ చేసిన టైటిల్ అని చెప్పాలి. ఇక కళ్యాణ్ రామ్ కెరియర్ లో అతనొక్కడే, పటాస్, బింబిసారా బ్లాక్ బస్టర్ హిట్స్ గా నిలిచాయి. ఈ మూవీ సినిమాలో మాస్ టచ్ ఉన్న టైటిల్స్ తో వచ్చినవే కావడం విశేషం. ఇక ఇక ఎన్టీఆర్ కెరియర్ లో కూడా ఎక్కువ మాస్ టైటిల్స్ తో వచ్చిన కథలు సూపర్ హిట్ అయ్యాయి.
క్లాస్ టచ్ తో వచ్చిన సినిమాలు పెద్దగా ఆకట్టుకోలేదు. ఇదిలా ఉంటే తాజాగా కళ్యాణ్ రామ్ అమిగోస్ అనే టైటిల్ తో ఇంటరెస్టింగ్ కాన్సెప్ట్ తో ప్రేక్షకుల ముందుకి వచ్చాడు. ఈ సినిమా బాగుందనే టాక్ వచ్చిన కూడా ఫస్ట్ డే కలెక్షన్స్ ఆశించిన స్థాయిలో రాలేదు. ఈ నేపధ్యంలో నందమూరి అభిమానులు అమిగోస్ సినిమాని పెద్దగా పట్టించుకోలేదు అనే టాక్ ఇప్పుడు ఫిల్మ్ నగర్ సర్కిల్ లో వినిపిస్తుంది.