Begin typing your search above and press return to search.

కళ్యాణ్ రామ్ 19 లో త్రిపాత్రాభిన‌యం..టైటిల్ ఇంట్రెస్టింగ్!

By:  Tupaki Desk   |   12 Oct 2022 9:30 AM GMT
కళ్యాణ్ రామ్ 19 లో త్రిపాత్రాభిన‌యం..టైటిల్ ఇంట్రెస్టింగ్!
X
నంద‌మూరి క‌ళ్యాణ్ రామ్ ఫుల్ స్వింగ్ లో ఉన్నారు. ఇటీవ‌లే 'బింబిసార‌'తో మ‌రో స‌క్సెస్ని ఖాతాలో వేసుకున్నారు. రెండు వైవిథ్య‌మైన‌ పాత్ర‌లు క‌ళ్యాణ్ రామ్ కి మంచి పేరు తీసుకొచ్చాయి. కొత్త ద‌ర్శ‌కుల‌తో హిట్ కొట్ట‌డం అన్న‌ది అత‌నికే చెల్లింద‌ని మ‌రోసారి నిరూపించారు. వ‌శిష్ట అనే కొత్త కుర్రాడితో చేసిన ప్ర‌య‌త్నం ఆద్యంతం ప్రేక్ష‌కుల్ని మెప్పించింది.

ఆ ర‌కంగా టాలీవుడ్ కి మ‌రో మంచి ద‌ర్శ‌కుడి ప‌రిచ‌యం చేసారు. ప్ర‌స్తుతం క‌ళ్యాణ్ రామ్ హీరోగా రాజేంద్ర రెడ్డి ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమా తెర‌కెక్కుతోన్న సంగ‌తి తెలిసిందే. బ‌డా నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేక‌ర్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. ప్ర‌స్తుతం ఈ సినిమా సెట్స్ లో ఉంది. తాజాగా ఈ సినిమాకి సంబంధించి ఇంట్రెస్టింగ్ అప్ డేట్ అందింది.

ఇందులో క‌ళ్యాణ్ రామ్ ఏకంగా మూడు విభిన్న పాత్ర‌లు పోషిస్తున్నారుట‌. మూడు వేటిక‌వి ప్ర‌త్యేకంగా ఉంటాయ‌ని స‌మాచారం. క‌ళ్యాణ్ రామ్ కెరీర్ లో నే ఇవి సాహ‌సోపేతమైన పాత్ర‌లు గానిలిచిపోతాయ‌ని అంటున్నారు. ఇంత వ‌ర‌కూ డ్యూయ‌ల్ రోల్ తో మెప్పించిన నంద‌మూరి వార‌సుడు ఏకంగా త్రిపాత్రిభ‌న‌యం చేయ‌డం ఇదే మొద‌టిసారి.

ఇలాంటి రోల్స్ పోషించ‌డం నంద‌మూరి వంశానికి మాత్ర‌మే చెల్లింది అనిపించేలా మేక‌ర్ పాత్ర‌ల్ని ఆద్యంతం ఆక‌ట్టుకునేలా మ‌లుస్తున్న‌ట్లు స‌మాచారం. ఆ పాత్ర‌ల ఆహార్యం వైవిథ్యంగా ఉంటుంద‌ని..మూడు పాత్ర‌ల్లోనూ ఫ్రెష్ లుక్ క‌నిపిస్తుందిని స‌మాచారం. ఆ పాత్ర‌ల బేస్ ఆధారంగానే సినిమాకి ఓ ఇంట్రెస్టింగ్ టైటిల్ కూడా ప‌రిశీలిస్తున్న‌ట్లు తెలుస్తోంది. 'ఎమిగోస్' అనే పేరుని ప‌రిశీలిస్తున్నారుట‌. ఇటీవ‌లే యూనిట్ గోవాలో కీల‌క స‌న్నివేశాలు చిత్రీక‌ర‌ణ పూర్తిచేసింది.

అందులో క‌ళ్యాణ్ రామ్ స‌హా ముఖ్య పాత్ర‌ధారులంతా పాల్గొన్నారు. సినిమాలో ఆ స‌న్నివేశాలు ప్ర‌త్యేక ఆక‌ర్ష‌ణ‌గా నిలుస్తాయ‌ని యూనిట్ ధీమా వ్య‌క్తం చేస్తోంది. త్వ‌ర‌లోనే చివ‌రి షెడ్యూల్ కూడా ప్రారంభం కానుంది. దీంతో షూటింగ్ పూర్తి కానుంది. అనంత‌రం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు మొద‌లు పెట్ట‌నున్న‌ట్లు తెలుస్తోంది.

క‌ళ్యాణ్ రామ్ త‌దుప‌రి ప్రాజెక్ట్ లు కూడా ఇంట్రెస్టింగ్ నే ఉంటాయ‌ని తెలుస్తోంది. అత‌నితో సినిమాలు చేయ‌డానికి స‌క్సెస్ ఫుల్ మేక‌ర్స్ ముందుకొస్తున్నారు. ఈనేప‌థ్యంలో క‌ళ్యాణ్ రామ్-యంగ్ టైగ‌ర్ ఎన్టీర్ తో ఓ భారీ మ‌ల్టీస్టార‌ర్ ని తెరెక్కించాల‌ని ప‌లువురు ద‌ర్శ‌క‌-నిర్మాత‌లు ఆస‌క్తి చూపిస్తున్నారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.