Begin typing your search above and press return to search.

ఈసారి నెంబర్‌ ను నమ్ముతున్నాడు!

By:  Tupaki Desk   |   25 Nov 2018 4:05 AM GMT
ఈసారి నెంబర్‌ ను నమ్ముతున్నాడు!
X
నందమూరి హీరో కళ్యాణ్‌ రామ్‌ కష్టపడి సినిమాలు చేస్తున్నా, వాటికి ఎన్టీఆర్‌ ప్రమోషన్‌ చేసినా కూడా అదృష్టం కలిసి రాకపోవడంతో సక్సెస్‌ లు దక్కడం లేదు. చాలా కాలం తర్వాత పటాస్‌ తో సక్సెస్‌ ను దక్కించుకున్న కళ్యాణ్‌ రామ్‌ మళ్లీ వరుసగా ఫ్లాప్స్‌ ను చవి చూస్తున్నాడు. సినిమా ఫలితాలతో సంబంధం లేకుండా, ఫ్లాప్స్‌ ను పట్టించుకోకుండా తనవంతు బాధ్యతగా సినిమాలను చేసుకుంటూ వెళ్తున్నాడు. ఇటీవలే తన అన్న కోసం ఒక చిత్రాన్ని చేయాల్సిందిగా మైత్రి వారిని ఎన్టీఆర్‌ కోరాడని కూడా వార్తలు వచ్చాయి. ప్రస్తుతం కళ్యాణ్‌ రామ్‌ నటిస్తున్న సినిమా షూటింగ్‌ ముగింపు దశకు చేరుకుంది.

ప్రముఖ సినిమాటోగ్రఫర్‌ కేవీ గుహన్‌ దర్శకత్వంలో కళ్యాణ్‌ రామ్‌ ప్రస్తుతం నటిస్తున్నాడు. ఈ చిత్రంలో హీరోయిన్స్‌ గా షాలిని పాండే - నివేదా థామస్‌ లు నటిస్తున్నారు. ఫిబ్రవరిలో ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. త్వరలోనే ఫస్ట్‌ లుక్‌ ను కూడా విడుదల చేయబోతున్నారు. ఇక ఈ చిత్రానికి ఒక నెంబర్‌ ను టైటిల్‌ గా ఖరారు చేయాలని భావిస్తున్నారట. సినిమా కథలో ‘118’ అనే నెంబర్‌ కు చాలా ప్రాముఖ్యత ఉంటుందట. అందుకే అదే నెంబర్‌ ను సినిమా టైటిల్‌ గా ఖరారు చేసినట్లుగా సమాచారం అందుతోంది.

‘ఎమ్మెల్యే’, ‘నా నువ్వే’ చిత్రాలపై భారీ అంచనాలు పెట్టుకున్న కళ్యాణ్‌ రామ్‌ కు ఆ చిత్రాలు నిరాశ పర్చాయి. ఈ చిత్రంను లో ప్రొఫైల్‌ లో తెరకెక్కిస్తున్నారు. ఇప్పటి వరకు పెద్దగా సందడి లేదు. విడుదల ముందు ఎన్టీఆర్‌ ను పబ్లిసిటీ కార్యక్రమాల్లో పాల్గొనేలా చేసి, సినిమాపై ఆసక్తిని కలిగించనున్నారని తెలుస్తోంది. ఈసారి నెంబర్‌ టైటిల్‌ ను నమ్ముకున్న కళ్యాణ్‌ రామ్‌ కు సక్సెస్‌ దక్కేనా చూడాలి.