Begin typing your search above and press return to search.

కీర‌వాణి త‌మ్ముడు కంగ‌న‌ను పొగిడేశాడే

By:  Tupaki Desk   |   28 Jan 2019 4:04 AM GMT
కీర‌వాణి త‌మ్ముడు కంగ‌న‌ను పొగిడేశాడే
X
క్రిష్ - కంగ‌న వార్ గురించి తెలిసిందే. ఎన్నో ఎమోష‌న‌ల్ ఘ‌ట్టాల త‌ర్వాత `మ‌ణిక‌ర్ణిక‌` సేఫ్ గా రిలీజైంది. రిలీజ్ త‌ర్వాతా వార్ కంటిన్యూ అవుతూనే ఉంది. `` క్రిష్ దీన్ని సినిమా అంటారా?... నువ్వు తీసింది భోజ్‌పురి సినిమాలా వుంది. మ‌ళ్లీ అంతా మార్చాలి. సోనూసూద్ క్యారెక్ట‌ర్‌ని మ‌ధ్య‌లోనే చంపేయ్.. అప్పుడే క‌థ‌ ర‌స‌వ‌త్త‌రంగా వుంటుంది`` అంటూ `మ‌ణిక‌ర్ణిక‌` విష‌యంలో కంగ‌న ర‌నౌత్ నాతో పాటు చిత్ర యూనిట్‌తోనూ ఆడుకుంద‌ని ద‌ర్శ‌కుడు క్రిష్ నిప్పులు చెరిగిన విష‌యం తెలిసిందే. కంగ‌న చేసిన ప‌ని స‌రైన‌దేనా? అంటూ ఆస‌క్తిక‌ర చ‌ర్చ సాగుతోంది. ఈ సినిమాపై క్రిటిక్స్ నుంచి మిశ్ర‌మ స్పంద‌న‌లు వ‌చ్చాయి. తాజాగా మ‌ణిక‌ర్ణిక చిత్రంపై కీర‌వాణి సోద‌రుడు క‌ళ్యాణి మాలిక్ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య చేశారు.

``మ‌ణిక‌ర్ణిక‌` చిత్రం చాలా బాగుంది. ఇది కంగ‌న ర‌నౌత్ బ్రాండ్ మూవీ. త‌న‌ గురించే మాట్లాడుకోవాలి. ఇండియ‌న్ సినిమాకు గ‌ర్వ‌కార‌ణం. ముఖ్యంగా సెకండాఫ్ చాలా బ్రిలియంట్‌గా తీసింది. ఈ సినిమాను ఎవ‌రు డైరెక్ట్ చేశార‌నేది పెద్ద విష‌య‌మే కాదు. సినిమా హైలీ ఎమోష‌న‌ల్ డొంట్ మిస్‌`` అంటూ ట్విట్ట‌ర్ వేదిక గా పోస్ట్ ను పెట్టారు. దీనిపై క్రిష్ వ‌ర్గాల్లో ఆస‌క్తిక‌ర చ‌ర్చ సాగుతోంది. క‌ల్యాణి మాలిక్ తన అభిప్రాయం చెప్పారు. అయితే దాన‌ర్థం క్రిష్ ని కించ‌ప‌ర‌చ‌డం కాదు క‌దా! అంటూ అభిమానులు ముచ్చ‌టించుకుంటున్నారు.

సినిమాపై ఎవ‌రైనా వ్య‌క్తిగ‌త విమ‌ర్శ చేయొచ్చు.. లేదా పొగ‌డొచ్చు. క‌ళ్యాణి మాలిక్ అదే చేశార‌ని భావించాల్సి ఉంటుంది. మ‌ణిక‌ర్ణిక త‌న‌కు న‌చ్చింద‌ని చెప్ప‌డం క్రిష్ కి వ్య‌తిరేకంగా చెప్ప‌డం కాదు క‌దా? అంటూ ప‌లువురు సామాజిక మాధ్య‌మాల్లో వ్యాఖ్యలు చేస్తున్నారు. ఇక క్రిష్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన `క‌థానాయ‌కుడు` ప‌రాజ‌యం పైనా ఆస‌క్తిక‌ర చ‌ర్చ సాగుతోంది. క‌ళ్యాణి మాలిక్ ప్ర‌స్తుతం ఆర్జీవీ `ల‌క్ష్మీస్ ఎన్టీఆర్` చిత్రానికి సంగీతం అందిస్తున్న సంగ‌తి తెలిసిందే.