Begin typing your search above and press return to search.

ఓన్లీ కళ్యాణ్‌ సినిమా ఒక్కటే

By:  Tupaki Desk   |   3 March 2016 11:30 AM GMT
ఓన్లీ కళ్యాణ్‌ సినిమా ఒక్కటే
X
కళ్యాణ్‌. అదేనండి.. యంగ్‌ డైరక్టర్‌ కళ్యాణ్‌ కృష్ణ. మనోడు ''సోగ్గాడే చిన్ని నాయనా'' సినిమాను ఏ ముహూర్తంలో తీశాడో కాని.. అది అందనంత రేంజుకు హిట్టెక్కి కూర్చోంది. 15 కోట్ల వ్యయంతో తీస్తే.. ఏకంగా 50 కోట్లు వచ్చేశాయి. అందుకే ఈ దర్శకుడికి నాగార్జున మరో రెండు ఛాన్సులు ఇవ్వాలని ఫిక్సయ్యాడు.

ఇకపోతే మొన్నమధ్యన రెండు మూడు కొత్త సినిమాల రూమర్లు వచ్చిన సంగతి తెలిసిందే. ప్రేమమ్‌ షూటింగ్ పూర్తయ్యాక.. నాగ చైతన్య ఎవరితో సినిమా చేస్తాడనేదే ఆ రూమర్ల సారాంశం. వీటిలో ముఖ్యంగా హరీశ్‌ శంకర్‌ అండ్‌ గోపిచంద్‌ మలినేని పేర్లు ప్రముఖంగా వినిపించాయి. అయితే తన కొడుకులకు మాస్‌ మసాలా సినిమాలు అంతగా సెట్టవ్వవు అని తేల్చేసిన నాగ్‌.. చైతూ తదుపరి సినిమాను కళ్యాణ్‌ కృష్ణతోనే ఫిక్స్‌ చేశాడట.

ఇప్పటికే కళ్యాన్‌ దాదాపు స్ర్కిప్టు వర్కును పూర్తి చేసినట్లు తెలుస్తోంది. ఏప్రియల్‌ నెలలో ఈ సినిమా షూటింగ్‌ మొదలవుతుందట. ఒక ప్రముఖ టాప్‌ హీరోయిన్‌ ను లీడ్‌ రోల్‌ లోకి తీసుకునే ఛాన్సుందని చెబుతున్నారు.