Begin typing your search above and press return to search.

బంగార్రాజు: ఐదేళ్లుగా క‌ళ్యాణ్ కృష్ణ ఎదురు చూపులు?

By:  Tupaki Desk   |   18 Aug 2021 11:30 AM GMT
బంగార్రాజు: ఐదేళ్లుగా క‌ళ్యాణ్ కృష్ణ ఎదురు చూపులు?
X
కింగ్ నాగార్జున క‌థానాయ‌కుడిగా `సోగ్గాడే చిన్ని నాయ‌నా` లాంటి మాస్ హిట్ చిత్రాన్ని తెర‌కెక్కించాడు క‌ళ్యాణ్ కృష్ణ‌. ఆంధ్ర‌ప్ర‌దేశ్- కాకినాడ‌కు చెందిన ఈ యువ‌ద‌ర్శుడిలో ప్ర‌తిభ‌కు కొద‌వేమీ లేదు. కానీ ఎందుక‌నో కాలం క‌లిసి రాలేదు. స‌రిగ్గా సోగ్గాడే క‌థ‌కు ప్రీక్వెల్ త‌ర‌హాలో ఒక క‌థ రాసుకుని నాగ్ కి వినిపించి ఓకే చేయించుకున్నాడు. స్క్రిప్టు రెడీ.. నాగ్ సెట్స్ కెళ్ల‌డానికి రెడీ.. ఇంత‌లోనే త‌న సోద‌రుడు మంత్రి క‌న్న‌బాబు ఆక‌స్మిక మ‌ర‌ణం అత‌డిలో విషాదం నింపింది. ఆ త‌ర్వాత ఆ సినిమా షూటింగ్ కూడా జ‌ర‌గ‌లేదు.

ఇంత‌లోనే నాగ్ వేరే స్క్రిప్టుల‌పై దృష్టి సారించ‌డం ప‌ట్టాలెక్కించేయ‌డంతో క‌ళ్యాణ్ మ‌రో సినిమాని చేయ‌లేక‌పోయారు. మ‌ళ్లీ ప్రారంభ‌మ‌వుతుంది అన‌గానే రెండుసార్లు క‌రోనా ప్ర‌జ‌ల‌పై దాడి చేసింది. దానివ‌ల్ల కూడా ఇది ఆల‌స్య‌మైంది. ఎట్ట‌కేల‌కు `బంగార్రాజు` టైటిల్ తో ప్రీక్వెల్ సెట్స్ పైకి వెళుతోంది. 2016లో సోగ్గాడే రిలీజ్ కాగా ఐదేళ్ల‌కు కానీ ఇది సాధ్య‌ప‌డ‌డం లేదు. ఆల‌స్య‌మైనా కానీ ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. బంగార్రాజు రెగ్యులర్ షూటింగ్ ఈ నెల 25 న ప్రారంభమవుతుంది. ఈ నెల 20న అధికారికంగా పూజాకార్య‌క్ర‌మం జ‌ర‌గ‌నుంది.

ఈ సినిమాలో నాగార్జున‌తో పాటు నాగ చైతన్య కూడా కీలక పాత్రను పోషిస్తున్నారు. ఉప్పెన ఫేమ్ బ్యూటీ కృతి శెట్టి ఈ చిత్రంలో చైత‌న్య స‌ర‌స‌న రొమాన్స్ చేస్తోంది. ర‌మ్య‌కృష్ణ త‌న పాత్ర‌లో క‌నిపిస్తారు. హైదరాబాద్ లోని రెండు ప్రముఖ స్టూడియోలలో కొన్ని భారీ సెట్లను నిర్మించి ఇక్క‌డే మెజారిటీ చిత్రీక‌ర‌ణ చేయ‌నున్నారు. సోగ్గాడే చిన్ని నాయనాలో బంగార్రాజు మరణం తర్వాత అత‌డి పాత్ర తీరు తెన్నుల‌ను చూపించారు. కానీ ఇప్పుడు `బంగార్రాజు`లో అతని మరణానికి ముందు కథను తెర‌పై చూపనున్నారు. ఇక ఈ సినిమాలో స్వ‌ర్గం న‌ర‌కం స‌న్నివేశాల‌ను కూడా చూపిస్తున్నారో ఏమిటో సెట్లు దేవ‌లోకాన్ని త‌ల‌పిస్తున్నాయ‌న్న గుస‌గుస వినిపిస్తోంది. ఒక‌వేళ బంగార్రాజును స్వ‌ర్గంలోంచి దించుతున్నారా? అన్న‌ది కూడా తెలియాల్సి ఉంది. ఐదేళ్లుగా క‌ళ్యాణ్ కృష్ణ ఎదురు చూపులతోనే వేచి ఉన్నారు. ఎట్ట‌కేల‌కు త‌న డ్రీమ్ నెర‌వేరుతోంది.