Begin typing your search above and press return to search.

ర‌వితేజకు ఏం కాలేదు...

By:  Tupaki Desk   |   27 Feb 2018 8:21 AM GMT
ర‌వితేజకు ఏం కాలేదు...
X
రాజా ది గ్రేట్ సినిమా హిట్ కొట్ట‌డంతో... ట‌చ్ చేసి చూడు చాలా ఆశ‌లు పెంచుకున్నాడు ర‌వితేజ‌. కానీ ఆ సినిమా అట్ట‌ర్ ఫ్లాప్ అయ్యింది. అయినా స‌రే రాజా దిగ్రేట్ సినిమా ఇచ్చిన ఊపులోనే దూసుకెళ్తున్నాడు ర‌వితేజ‌. హఠాత్తుగా అత‌నికి ఏదో అయింద‌ని... ఆరోగ్య స‌మ‌స్య‌లు త‌లెత్తాయని రూమ‌ర్లు వ‌చ్చాయి. వాటిపై క్లారిటీ వ‌చ్చిందిప్పుడు.

ర‌వితేజ ఆరోగ్యం బాగాలేదు... అత‌నికి మూడు వారాల బెడ్ రెస్ట్ అవ‌స‌ర‌మ‌ని చెప్పారు వైద్యులు... అందుకే షూటింగ్ కూడా ఆపేశారు... అని వార్త‌లు వ‌చ్చాయి. ర‌వితేజ అభిమాని ఒక‌రు... ఈ విష‌యాన్ని చిత్ర‌యూనిట్ దృష్టికే తీసుకెళ్లారు. ఆ విష‌యంపై డైరెక్ట‌ర్ క‌ళ్యాణ్ కృష్ణ క్లారిటీ ఇచ్చాడు. అత‌ను ప్ర‌స్తుతం మాస్ మ‌హారాజాతో క‌లిసి నేల టిక్కెట్ సినిమా తీస్తున్నాడు. అత‌ను చెప్పిన దాని ప్ర‌కారం... ర‌వితేజ‌కు ఏం కాలేదు. అత‌ను సంపూర్ణ ఆరోగ్యంగా ఉన్నాడు. అభిమానులెవ‌రూ ఇలాంటి రూమ‌ర్లు న‌మ్మ‌వ‌ద్దు అని చెప్పాడు. అంతేకాదు షూటింగ్ కూడా య‌థాత‌థంగా జ‌రుగుతోంది అని చెప్పారు. ర‌వితేజ ఏడాది క్రితం బాగా బ‌రువు త‌గ్గారు. ముఖం పీక్కుపోయిన‌ట్టు అయింది. దీంతో అత‌నికి ఆరోగ్యానికి ఏదో అయింద‌ని... ఏదో స‌మ‌స్య‌లు ఉన్నాయ‌న్న అనుమానాలు జ‌నాల్లో పాత‌కుపోయాయి. అయితే కేవ‌లం జిమ్‌ లో అధికంగా వ‌ర్క‌వుట్లు చేయ‌డం వ‌ల్ల బ‌రువు త‌గ్గిన‌ట్టు ర‌వితేజ స్ప‌ష్టం చేశాడు. అయినా రూమ‌ర్లు మాత్రం ఆగ‌డం లేదు.

ట‌చ్ చేసి చూడు సినిమాకు ముందే... ర‌వితేజ - క‌ళ్యాణ్ కృష్ణ కాంబినేష‌న్లో సినిమా కోసం సైన్ జ‌రిగిపోయింది. షూటింగ్ కూడా జోరుగానే సాగుతోంది. ఇప్ప‌టికే చాలా మ‌టుకు ముఖ్య‌మైన సీన్ల‌న్నీ చిత్రీక‌రించేశారు. ఈ ఏడాదే విడుద‌ల చేసేందుకు సిద్ధ‌ప‌డుతున్నారు.