Begin typing your search above and press return to search.

అఫీషియల్: రవితేజ అతనితోనే..

By:  Tupaki Desk   |   13 Dec 2017 5:41 PM GMT
అఫీషియల్: రవితేజ అతనితోనే..
X

'రాజా ది గ్రేట్' సినిమా ఒక పెద్ద బ్లాక్ బాస్టర్ కాకపోయినా కూడా.. అప్పటికే హిట్టు కోసం కరువులో కూరుకుపోయిన మాస్ రాజా రవితేజకు మంచి రిలీఫ్‌ నే ఇచ్చింది. సినిమాకు మంచి కలక్షన్లే వచ్చాయి. అయితే ఈ సినిమా తరువాత మన మాస్ హీరో మాత్రం అస్సలు సినిమాలు సైన్ చేయట్లేదని కొందరు.. ఆయనతో ఎవ్వరూ సినిమాలు సైన్ చెయ్యట్లేదని ఇంకొందరు కామెంట్ చేశారు. అయితే ఇప్పుడు ఆయన నెక్ట్స్ సినిమాపై క్లారిటీ వచ్చేసింది.

చాలామంది దర్శకులు రవితేజకు కథలను వినిపిస్తున్నా కూడా.. ఇప్పుడు సోగ్గాడే చిన్నినాయనా పేం కళ్యాణ్‌ కృష్ణ చెప్పిన కథకే ఈయన మొగ్గుచూపాడట. అమెరికాలో ఐటి సంస్థను నడుపుతున్న హైదరాబాద్ కు చెందిన రామ్ తాళ్ళూరి ఈ సినిమాతో నిర్మాత అవతారం ఎత్తుతున్నారట. గతంలో ఈయన చుట్టాలబ్బాయ్ అనే సినిమాను కూడా తీశారు. అయితే ఆ తరువాత రవితేజతో ఎన్నో సినిమాలను ప్రొడ్యూస్ చేయాలని చూసి.. చివరకు అవి చేజారిపోయాయ్. ఫైనల్ గా ఇప్పటికి సెట్టయినట్లు తెలుస్తోంది.

ఇకపోతే రారండోయ్ వేడుక చూద్దాం సినిమాతో అన్నపూర్ణ స్టూడియోస్ లోనే కళ్యాణ్‌ కృష్ణ మరో సినిమా చేయాల్సి ఉంది. కాని ఈ దర్శకుడు చెప్పిన బంగార్రాజు సినిమా కథ నచ్చకపోవడంతో ఇప్పుడు నాగ్ ఆ సినిమాను వద్దన్నారని.. అందుకే ఈయన వేరే కథతో రవితేజతో సినిమా చేస్తున్నాడనే టాక్ ఉంది.