Begin typing your search above and press return to search.

ఆగిన సినిమా పట్టాలెక్కుతోందా?

By:  Tupaki Desk   |   8 Dec 2017 5:47 AM GMT
ఆగిన సినిమా పట్టాలెక్కుతోందా?
X
రాజా ది గ్రేట్ తో తనను తాను గ్రాండ్ గా రీలాంఛ్ చేసుకున్నాడు మాస్ మహరాజ్. ఇదే జోరుతో వరుస సినిమాలకు ఓకే చెప్పేస్తున్నాడు. ఇప్పటికే టచ్ చేసి చూడు అంటూ కొత్త దర్శకుడితో ఓ సినిమా చేస్తున్న రవితేజ.. పోలీస్ ఆఫీసర్ పాత్రలో తన పవర్ చూపించబోతున్నాడు.

మరోవైపు తనకు హీరోగా కెరీర్ ఇచ్చిన శ్రీనువైట్లకు ఓ సినిమా చేసేందుకు ఓకే చెప్పిన రవితేజ.. మరోవైపు ఫ్యామిలీ ఆడియన్స్ ను అలరించేందుకు కూడా రెడీ అయిపోయాడు. సోగ్గాడే చిన్ని నాయన.. రా రండోయ్ వేడుక చూద్దాం వంటి ఫ్యామిలీ ఎంటర్టెయినర్స్ అందించిన కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో ఓ ముూవీ చేసేందుకు మాస్ రాజా ఓకే చెప్పిన సంగతి తెలిసిందే. అయితే.. అన్నపూర్ణ స్టూడియోస్ తో కళ్యాణ్ కృష్ణకి ఉన్న అగ్రిమెంట్ కారణంగా.. ఈ ప్రాజెక్టు ఆగిపోయిందనే టాక్ వచ్చింది. కానీ ఇప్పుడీ అభ్యంతరాలు అన్నిటికీ తెర పడిపోయినట్లు తెలుస్తోంది.

త్వరలోనే రవితేజ-కళ్యాణ్ కృష్ణ కాంబినేషన్ లో ముూవీ అనౌన్స్ మెంట్ రానుందట. చుట్టాలబ్బాయి చిత్రాన్ని నిర్మించిన రామ్ తాళ్లూరి.. ఈ మూవీకి నిర్మాతగా వ్యవహరించనున్నట్లు తెలుస్తోంది. రవితేజతో కూడా ఫ్యామిలీ డ్రామానే తెరకెక్కిస్తాడట కళ్యాణ్ కృష్ణ. మొత్తానికి ఆగిపోయిందని అంతా అనుకున్న ప్రాజెక్టును తిరిగి స్టార్ట్ చేయడంలో.. రవితేజ మరోసారి సక్సెస్ అయ్యాడు.