Begin typing your search above and press return to search.

బంగార్రాజు సీక్వెల్.. వీళ్లెవ‌రూ హీరోలు కాదు!

By:  Tupaki Desk   |   10 Jan 2022 6:35 AM GMT
బంగార్రాజు సీక్వెల్.. వీళ్లెవ‌రూ హీరోలు కాదు!
X
క‌ళ్యాణ్ కృష్ణ ట్విస్టులిస్తున్నాడు. సోగ్గాడే చిన్ని నాయ‌నా చిత్రాన్ని నాగార్జున‌తో తెర‌కెక్కించి .. ఇప్పుడు బంగార్రాజు లో చైత‌న్య‌ను యాడ్ చేసాడు. బంగార్రాజుకు సీక్వెల్ తీస్తే ఆ ఇద్ద‌రితో కాద‌ట‌.. ఇంకో హీరో యాడ‌వుతాడ‌ని క్లూ ఇచ్చి మ‌రో ట్విస్టిచ్చాడు. వివ‌రాల్లోకి వెళితే..

`సొగ్గాడే చిన్ని నాయనా`కి సీక్వెల్ గా ద‌ర్శ‌కుడు క‌ళ్యాణ్ కృష్ణ `బంగార్రాజు`ని తెర‌కెక్కిస్తోన్న సంగ‌తి తెలిసిందే. ఇందులో నాగార్జున‌..నాగ‌చైత‌న్య హీరోలుగా న‌టిస్తున్నారు. ఇప్ప‌టికే సినిమాపై భారీ అంచ‌నాలున్నాయి. ప్ర‌చార చిత్రాలు సినిమాకి మంచి హైప్ ని తీసుకొచ్చాయి. అనూహ్యంగా సినిమా సంక్రాంతి బ‌రిలో నిలిచింది. జ‌న‌వ‌రి 14న ప్రేక్ష‌కుల ముందుకు తీసుకొస్తున్నారు. తాజాగా సినిమాలో అఖిల్ కూడా న‌టిస్తున్నాడ‌ని...`మ‌నం` సినిమా త‌ర‌హాలో క్లైమాక్స్ లో అఖిల్ మెరుపులు ఉండబోతున్నాయి ప్ర‌చారం సాగుతోంది. ఈ నేప‌థ్యంలో అఖిల్..ఉన్నాడా? లేడా? అన్న దానిపై నాగార్జున క్లారిటీ ఇచ్చేసారు.

ఇందులో అఖిల్ న‌టించ‌లేద‌ని వెల్ల‌డించారు. దీంతో కొత్త ప్ర‌చారం తెర‌పైకి వ‌చ్చింది. `బంగార్రాజు`కి సీక్వెల్ ఉంటుంద‌ని..అందులో హీరోగా అఖిల్ న‌టిస్తాడ‌ని ప్ర‌చారం మొద‌లైంది. దీనిపై వివర‌ణ ఇవ్వ‌డానికి ఈసారి క‌ల్యాణ్ కృష్ణ సీన్ లోకి వ‌చ్చారు. అఖిల్ తో `బంగార్రాజు`కి సీక్వెల్ క‌ష్టం. కానీ ఆ ర‌కంగా మంచి క‌థ గ‌నుక కుదిరితే సీక్వెల్ ఉండొచ్చు. అయితే అంత‌కు ముందే ఆ క‌థ‌తో నేను సంతృప్తి చెందాలి. త‌ర్వాత వాళ్లంద‌ర్ని మెప్పించాలి. అదేమీ అంత ఈజీ కాదు. చాలా హార్డ్ వ‌ర్క్ తో కూడుకున్న‌ది. ప్ర‌స్తుతానికి సీక్వెల్ ఆలోచ‌న లేదు. `బంగార్రాజు` రిలీజ్ పైనే వ‌ర్క్ చేస్తున్నామ‌ని తెలిపారు.

అక్కినేని హీరోలైన నాగార్జున‌...నాగ‌చైత‌న్య‌తో క‌ళ్యాణ్ కృష్ణ సినిమాలు చేసిన సంగ‌తి తెలిసిందే. చైత‌న్య‌తో `రారండోయ్ వేడుక చూద్దాం` తెర‌కెక్కించారు. ఆ సినిమా య‌వ‌రేజ్ గా ఆడింది. ఇక బ్యాలెన్స్ అఖిల్ ఒక్క‌డే మిగిలాడు. ఆ యంగ్ హీరోతోనూ ఓ ఫ్యామిలీ థ్రిల్ల‌ర్ చిత్రాన్ని తీసేస్తే అక్కినేని బిగ్ స్టార్స్ అంద‌రినీ అక్కినేని అభిమానిగా క‌ళ్యాణ్ కృష్ణ క‌వ‌ర్ చేసిన‌ట్లే. ఈ డైరెక్ట‌ర్ ఆశ‌ల‌న్నీ `బంగార్రాజు` స‌క్సెస్ పైనే అధార‌ప‌డి ఉన్నాయి. తొలి సినిమా స‌క్సెస్ అటుపై డిలేస్ .. మ‌రికొన్ని ఇబ్బందులు కార‌ణంగా సినిమాలు వ‌దిలేద్దాం అంటూ క‌ళ్యాణ్ కృష్ణ‌ డిసైడ్ అయ్యారని గుస‌గుస‌లు వినిపించాయి. కానీ నాగార్జున అలాంటి నిర్ణ‌యాలు తీసుకోవ‌ద్ద‌ని ప్రోత్స‌హించ‌డంతో వెన‌క్కి త‌గ్గారన్న టాక్ వినిపించింది. కింగ్ ఆద‌ర‌ణ ప్రోత్సాహంతో క‌ళ్యాణ్ కి మ‌రిన్ని అవ‌కాశాలకు కొద‌వేమీ లేదు. బంగార్రాజుపై పాజిటివ్ బ‌జ్ ఉంది. సంక్రాంతి బ‌రిలో సోలో క్రేజీ చిత్ర‌మిది. ఇది అత‌డికి క‌లిసొస్తుంది. క‌ళ్యాణ్ కి త‌న ప్ర‌తిభ‌ను నిరూపించుకునేందుకు ఇంకా చాలా పెద్ద స్కోప్ ఉంది.