Begin typing your search above and press return to search.

చెత్త రివ్యూకి హ్యాపీ అంటున్న కళ్యాణ్

By:  Tupaki Desk   |   2 March 2016 1:29 PM GMT
చెత్త రివ్యూకి హ్యాపీ అంటున్న కళ్యాణ్
X
కళ్యాణ్ మాలిక్ అలియాస్ కళ్యాణ్ కోడూరి అందించే సంగీతం ఎప్పుడూ సంథింగ్ స్పెషల్ అన్నట్లుగా ఉంటుంది. ప్రస్తుతం ఈయన నందినీ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన కళ్యాణ వైభోగమే చిత్రానికి సంగీతం అందించాడు. మరో రెండు రోజుల్లో విడుదల కానున్న ఈ మూవీ సాంగ్స్ ఇప్పటికే శ్రోతలను ఆకట్టుకుంటున్నాయి. కానీ టీవీ ఛానల్ మాత్రం కళ్యాణ వైభోగమేకి బ్యాడ్ రేటింగ్ ఇచ్చింది.

'కళ్యాణ వైభోగమేకి వచ్చిన కాంప్లిమెంట్స్ కి బోర్ కొట్టింది. నిన్న రాత్రి టీవీ5లో ఈ సినిమా గురించి కావాల్సినంత చెత్తగా మాట్లాడారు. అందులో భాగంగా మ్యూజిక్ పరమ లౌజీగా ఉందని అనడం.. చాలా హ్యాపీగా అనిపించింది. చెవులకి అదో మార్పు కదా' అంటూన్నాడు కళ్యాణ్ కోడూరి. ఒక మంచి ఆల్బంకి ఏదో ఒక బ్యాడ్ రివ్యూ తప్పనిసరిగా ఉంటుందని, కచ్చితంగా వినిపిస్తుందని చెప్పాడు ఈ మ్యూజిక్ డైరెక్టర్. తన ఆల్బంని విమర్శించిన ఛానల్ ని.. నేరుగా కాకుండా.. ఇలా ఇన్ డైరెక్టుగా విమర్శించాడు కళ్యాణ్ కోడూరి.

ఆ ఛానల్ ఒక్కటే అలా మాట్లాడుంతోందని, మిగతా వారంతా బాగుందంటున్నారని ఇలా చెప్పాడన్న మాట. అయితే.. సంగీత ప్రియులు మాత్రం కళ్యాణ వైభోగమే సాంగ్స్ ని ఎంజాయ్ చేస్తున్నామని అంటున్నారు. మ్యూజిక్ విషయంలో వినూత్నంగా ప్రయత్నించారనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.