Begin typing your search above and press return to search.

అల్లుడి చాయిస్ ని ఒకే చేసిన చిరు

By:  Tupaki Desk   |   9 Dec 2017 3:26 PM IST
అల్లుడి చాయిస్ ని ఒకే చేసిన చిరు
X
టాలీవుడ్ లో బిగ్గెస్ట్ హీరోల ఫ్యామిలీగా ఉన్న మెగా ఫ్యామిలీ నుంచి యువ హీరోలు ఎంట్రీలు బాగానే ఇస్తున్నారు. అయితే మెగా స్టార్ చిన్న అల్లుడు కళ్యాణ్ కూడా వెండితెరపై తన అదృష్టాన్ని పరీక్షించుకోవాలని తెగ ఆరాటపడుతున్నారట. ప్రస్తుతం టాలీవుడ్ లో ఈ న్యూస్ చాలా హాట్ టాపిక్ గా మారింది. అయితే సినిమా కథను కూడా కళ్యాణ్ ఎంచుకోవడం మరో స్పెషల్ అని చెప్పాలి.

సాధారణంగా మెగా ఫ్యామిలిలో ప్రతి ఒక్కరి మొదటి సినిమాను మెగాస్టార్ చిరంజీవి ఫైనల్ చేసినవే. అయన ఒప్పుకున్నాకే సినిమా షూటింగ్ లు స్టార్ట్ అయ్యేవి. అందుకు తన సలహాలను చిరు చాలా ఇచ్చేవారు. ఇకపోతే రీసెంట్ గా కళ్యాణ్ ని కూడా సినిమాల్లోకి రప్పించాలని కొన్ని కథల కోసం వెతుకుతుండగా కళ్యాణ్ కొత్త దర్శకుడైన రాకేష్ శశిని చిరుకు పరిచయం చేయించి.. కథను వినిపించాడు. చిరుకి కథ చెప్పిన విధానం చాలా బాగా నచ్చేసింది. దీంతో ఏ మాత్రం తడబడకుండా ఒకే అన్నారని తెలుస్తోంది.

యువ దర్శకుడు రాకేష్ శశి.. వైజాగ్ సత్యానంద్ కి అత్యంత సన్నిహితుడని సమాచారం. గత కొంత కాలంగా కళ్యాణ్ కూడా సత్యానంద్ దగ్గరే నటనలో శిక్షణనూ తీసుకుంటున్నాడు. ఇకపోతే త్వరలోనే సినిమా సెట్స్ పైకి వెళ్లనుందని సమాచారం. నిర్మాత సాయి కొర్రపాటి సినిమాను తెరకెక్కించే విధంగా చిరు ప్రణాళికలను సిద్ధం చేసుకుంటున్నారని తెలుస్తోంది. మరి ఆ మూవీ ఎప్పుడు తెరకెక్కుతుందో చూడాలి.