Begin typing your search above and press return to search.

'విజేత'గా రెడీ అయిన మెగా అల్లుడు

By:  Tupaki Desk   |   23 May 2018 4:54 AM GMT
విజేతగా రెడీ అయిన మెగా అల్లుడు
X
మెగా ఫ్యామిలీ నుంచి మరో ఇద్దరు హీరోలు రాబోతున్నట్లు గత కొంత కాలంగా వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. సాయి ధరమ్ తేజ్ సోదరుడు అలాగే మెగా స్టార్ చిరంజీవి చిన్న అల్లుడు కళ్యాణ్ దేవ్ ఎంట్రీ ఇవ్వడానికి బ్యాక్ గ్రౌండ్ వర్క జరుగుతున్నట్లు అనేక కథనాలు వెలువడ్డాయి. ఇక ఫైనల్ గా అల్లుడు గారే మెగా ఎంట్రీ ఇవ్వడానికి సిద్ధమయ్యారు. గత కొంత కాలంగా నటనలో డ్యాన్స్ లలో శిక్షణ తీసుకున్న కళ్యాణ్ దేవ్ మొత్తానికి రెడీ అయ్యాడు.

సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ టైటిల్ ని కూడా రిలీజ్ చేశారు. తండ్రి కొడుకుల అనుబంధంకి తగ్గట్టుగా అందులో రెండు చేతులు కలవడం చూస్తుంటే ముందుగా చెప్పినట్లు సినిమా ఫాదర్ అండ్ సన్ సెంటిమెంట్ తో కథ నడుస్తోందని చెప్పవచ్చు. ఇక మెగాస్టార్ నుంచి 1985 లో వచ్చిన విజేత సినిమా టైటిల్ నే అల్లుడి సినిమాకు టైటిల్ గా పెట్టేశారు. మెగా సపోర్ట్ ఎంత ఉంటుందో గాని మూవీకి మెగా టచ్ మిస్ అవ్వదు అని మొదటి లుక్ తోనే చెప్పేశారు.

ఇక రాకేష్ శశి అనే యువ దర్శకుడు తెరకెక్కిస్తున్న ఈ కథను సాయి కొర్రపాటి వారాహి చలన చిత్రం వారు నిర్మిస్తున్నారు. రజిని కొర్రపాటి నిర్మాతగా వ్యవహరించనున్నారు. ఇక రాజమౌళి ఆస్థాన సినిమాటోగ్రఫర్ కేకే.సెంథిల్ కుమార్ ఈ సినిమాకు కెమెరామెన్ గా వర్క్ చేయడం ప్లస్ పాయింట్. హర్షవర్ధన్ రామేశ్వర్ సంగీతం అందిస్తుండగా మాళవిక నాయర్ ను కళ్యాణ్ దేవ్ కు జోడిగా సెట్ చేశారు. ఇటీవల మాళవిక నాయర్ మహానటి సినిమాలో అలమేలు పాత్రలో కనిపించిన సంగతి తెలిసిందే.