Begin typing your search above and press return to search.
కూతురితో కళ్యాణ్ దేవ్ .. ఆ నాలుగు గంటలే ఆనందం!
By: Tupaki Desk | 19 Jun 2023 6:47 PM ISTచిరంజీవి చిన్న కుమార్తె శ్రీజ కొణిదెల-కళ్యాణ్ దేవ్ విడాకుల వార్తలు నిరంతరం మీడియాలో వినిపిస్తున్నాయి. వాటిని అధికారికంగా ఇరువైపులా ధృవీకరించలేదు. కల్యాణ్.. శ్రీజ సోషల్ మీడియా యాక్టివిటీస్ చాలా విషయాల్ని చెబుతున్నాయి. తొలిగా శ్రీజ తన సోషల్ మీడియా ఖాతాల నుండి కళ్యాణ్ దేవ్ పేరు తొలగించడంతో రూమర్స్ బలపడ్డాయి.
కొంత కాలంగా మెగా ఫ్యామిలీతో కళ్యాణ్ దేవ్ కనిపించకపోవడంతో దీనిపై చర్చ సాగింది. అలాగే కళ్యాణ్ నటించిన సూపర్ మచ్చి- కిన్నెరసాని చిత్రాలు మెగా ప్రమోషన్ లేకుండానే విడుదలవ్వడం ఆశ్చర్యపరిచింది.
ప్రతిసారీ కళ్యాణ్ దేవ్ తన కుమార్తె బర్త్ డే సందర్భంగా స్పెషల్ పోస్టులు పెడుతూ అందరికీ టచ్ లోకి వస్తున్నాడు. గత ఫిబ్రవరి 11 తన కూతురు నవిష్క బర్త్ డే సందర్భంగా ఎమోషనల్ అవుతూ ఓ వీడియోను కళ్యాణ్ పోస్ట్ చేశారు.
తన కుమార్తె నవిష్కతో తన జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ మిస్సింగ్ యూ!! అని ఆవేదనను వ్యక్తం చేసారు. 2016లో శ్రీజ కళ్యాణ్ దేవ్ వివాహం కాగా 2018లో వారసురాలు నవిష్క జన్మించింది. ప్రస్తుతం శ్రీజ వద్దనే నవిష్క ఉందని చెబుతున్నారు.
తాజాగా ఫాదర్స్ డే సందర్భంగా కళ్యాణ్ దేవ్ తన కుమార్తె నవిష్క తో గడిపిన ఫోటోలను షేర్ చేసి ప్రతి వారం ఆనందంగా గడిపే నాలుగు గంటలు ఇవే! అంటూ వ్యాఖ్యానించాడు. దీంతో ఈ విడాకుల వార్తలు నిజమేనని నెటిజనుల్లో మరోసారి చర్చ సాగుతోంది. అయితే అధికారికంగా ఇరువైపుల నుంచి క్లారిటీ రావాల్సి ఉంది.
శ్రీజ తొలిగా శిరీష్ భరద్వాజ్ ను పెళ్లాడగా ఈ జంటకు ఓ బిడ్డ జన్మించింది. అయితే అతనితో మనస్పర్థల వల్ల విడాకుల ప్రహసనం తెలిసినదే. అనంతరం కొంత గ్యాప్ తర్వాత చిరు తమ దగ్గర బంధువుల సంబంధం వెతికారు. కళ్యాణ్ దేవ్ ను శ్రీజ రెండో వివాహం చేసుకున్నారు. కానీ ఇప్పుడిలా మరోసారి బ్రేకప్ వార్తలు మెగాభిమానుల ఆవేదనకు కారణమవుతున్నాయి.