Begin typing your search above and press return to search.

SRT ఎంటర్‌ టైన్‌ మెంట్స్‌ లో కళ్యాణ్‌ దేవ్‌ మూవీ

By:  Tupaki Desk   |   12 Nov 2020 2:40 PM IST
SRT ఎంటర్‌ టైన్‌ మెంట్స్‌ లో కళ్యాణ్‌ దేవ్‌ మూవీ
X
మెగా ఫ్యామిలీ హీరో కళ్యాణ్‌ దేవ్‌ మూడవ సినిమా పూజా కార్యక్రమాలు జరిగాయి. విజేత సినిమాతో పరిచయం అయిన కళ్యాణ్‌ దేవ్‌ ఇటీవల సూపర్‌ మచ్చి సినిమాను పూర్తి చేశాడు. ఆ సినిమా థియేటర్లు ఓపెన్‌ అయిన తర్వాత సరైన సమయంలో విడుదల చేయాలని మేకర్స్‌ వెయిట్ చేస్తున్నారు. సూపర్‌ మచ్చిని ముగించిన వెంటనే ఎస్‌ ఆర్‌ టీ ఎంటర్‌ టైన్‌ మెంట్స్ లో రమణ తేజ దర్శకత్వంలో సినిమా చేసేందుకు కళ్యాణ్‌ దేవ్‌ ఓకే చెప్పాడు. విభిన్నమైన కథతో ఈ సినిమా రూపొందబోతున్నట్లుగా మేకర్స్‌ ప్రకటించారు.

అశ్వధామ సినిమాతో దర్శకుడిగా విమర్శకుల ప్రశంసలు దక్కించుకున్న రమణ తేజ ఈ సినిమాతో కళ్యాణ్‌ దేవ్‌ కు కమర్షియల్‌ సక్సెస్‌ ను ఇవ్వబోతున్నాడు అంటున్నారు. ప్రముఖ నిర్మాత.. వ్యాపారవేత్త అయిన రామ్‌ తాళ్లూరి ఈ సినిమాను నిర్మించబోతున్నారు. కల్కి సినిమాకు రచయితగా వ్యవహరించిన సాయి తేజ్‌ ఈ సినిమాకు కథను అందిస్తున్నాడు. ఇక ఈ సినిమా కోసం ఈమద్య బాగా ఫేమస్‌ అయిన మహతి సాగర్‌ సంగీతాన్ని అందించబోతున్నాడు.

ఛలో మరియు భీష్మ సినిమాలు మ్యూజికల్‌ గా సక్సెస్‌ అయ్యాయి. మరోసారి ఆయన ఈ సినిమాతో ఒక మంచి మ్యజికల్‌ ఆల్బంను ఇస్తాడని అంతా నమ్మకంగా ఉన్నారు. దీపావళి కానుకగా నవంబర్‌ 14న టైటిల్‌ ను అధికారికంగా ప్రకటించబోతున్నాం అంటూ నిర్మాత రామ్‌ తాళ్లూరి అన్నారు. నేడు జరిగిన పూజా కార్యక్రమాలకు వెంకీ కుడుముల.. ప్రణీత్‌.. వేణు ఉగుడులలు హాజరు అయ్యి యూనిట్‌ సభ్యులకు శుభాకాంక్షలు తెలియజేశారు.