Begin typing your search above and press return to search.

మెగా అల్లుడు ఫస్ట్‌ టైమ్‌ ఫుల్ మాస్ అవతార్‌

By:  Tupaki Desk   |   3 Sept 2021 12:03 PM IST
మెగా అల్లుడు ఫస్ట్‌ టైమ్‌ ఫుల్ మాస్ అవతార్‌
X
మెగాస్టార్ చిరంజీవి చిన్నల్లుడు కళ్యాణ్‌ దేవ్‌ హీరోగా వరుస సినిమాలు చేస్తున్నాడు. మొదటి సినిమా విజేత నిరాశ పర్చడంతో కాస్త గ్యాప్ తీసుకుని కళ్యాణ్ దేవ్‌ ఆ తర్వాత సూపర్‌ మచ్చి సినిమాను చేసిన విషయం తెల్సిందే. ఆ సినిమా తర్వాత కళ్యాణ్ దేవ్ చాలా కథలు విన్నాడు. ఎట్టకేలకు ఆయన తన తదుపరి సినిమాకు సైన్‌ చేశాడు. నేడు ఉదయం సినిమా షూటింగ్ కార్యక్రమాలు హైదరాబాద్ లో మొదలు అయ్యాయి.

కళ్యాణ్‌ దేవ్ ను పూర్తి స్థాయిలో మాస్‌ అవతార్ లో యాక్షన్ హీరోగా చూపించబోతున్నట్లుగా మేకర్స్ చెబుతున్నారు. ఈ సినిమాకు కుమార స్వామి నాయుడు దర్శకత్వం వహించబోతున్నాడు. మోనిష్‌ పట్టిపాటి నిర్మిస్తున్నాడు. ఈ సినిమా తో కళ్యాణ్ దేవ్ కు మాస్ ఇమేజ్ వస్తుందని ఇప్పటి వరకు చూడని కళ్యాణ్ దేవ్ ను చూపిస్తామని మేకర్స్ చెబుతున్నారు. రెగ్యులర్‌ షూటింగ్ ను త్వరలో ప్రారంభించి వచ్చే ఏడాదిలో విడుదల చేసేలా ప్లాన్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది.

ఇక కళ్యాణ్ దేవ్‌ విజేత తర్వాత నటన విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవడంతో పాటు డైలాగ్ డెలవరీ విషయంలో కూడా పట్టు పెంచుకునే ప్రయత్నం చేస్తున్నాడు. ఇక ఇప్పటికే ఈయన నటించిన సూపర్ మచ్చి మరియు కిన్నెర సాని సినిమాలు విడుదలకు సిద్దంగా ఉన్నాయి. మరో సినిమా లో కూడా ఈయన నటించాడు. ఆసినిమా షూటింగ్‌ చివరి దశలో ఉంది. తాజాగా ఈ టైటిల్‌ నిర్ణయించని కొత్త సినిమాకు కమిట్ అయ్యాడు. మొత్తంగా నాలుగు సినిమాలతో మెగా అల్లుడు ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్దం అవుతున్నాడు.