Begin typing your search above and press return to search.
మెగా యువహీరోల్లో ముందు చూపుతో ఆలోచిస్తున్నాడట!
By: Tupaki Desk | 31 Aug 2021 10:03 AM ISTమెగా అల్లుడు కళ్యాణ్ దేవ్ `విజేత` చిత్రంతో టాలీవుడ్ కి పరిచయమైన సంగతి తెలిసిందే. తొలి సినిమాతో కళ్యాణ్ నటుడిగా పాస్ అయ్యారు. కమర్శియల్ గా సినిమా పెద్ద సక్సెస్ కానప్పటికీ కంటెంట్ హైలైట్ అయింది. కళ్యాణ్ లో నటుడు పరిణతి చెందాల్సి ఉందని క్రిటిక్స్ విశ్లేషించారు. ఆ తర్వాత `సూపర్ మచ్చి` అనే సినిమా ప్రారంభించారు. ఈ చిత్రం రిలీజ్ కు రెడీగా ఉన్నా..క్రైసిస్ వల్ల అంతకంతకు ఆలస్యమవుతోంది. మధ్యలో మరో సినిమా కమిట్ అయినా ఆ ప్రాజెక్ట్ రద్దయింది. ప్రస్తుతం `కిన్నెరసాని` అనే సినిమా చేస్తున్నారు. దీనికి సంబంధించి ఇటీవలే టైటిల్ ప్రకటన వెలువడగా మంచి స్పందన లభించింది.
ఇది డిఫరెంట్ జోనర్ సినిమాగా తెలుస్తోంది. ఇందులో కళ్యాణ్ పాత్ర రొటీన్ కు భిన్నంగా ఉంటుంది. వైవిధ్యమైన యూత్ ఫుల్ లవ్ స్టోరీలో ఆసక్తికర పాత్రలో కనిపిస్తాడట. ఒక రకంగా ఇది ప్రయోగాత్మక చిత్రంగానే కనిపిస్తుంది. థీమ్ ఆఫ్ కిన్నెరసాని ప్రమోషన్ ఆద్యంతం ఆకట్టుకుంటుంది. సస్పెన్స్ హారర్ క్రైమ్ థ్రిల్లర్ మిక్స్ డ్ తో ఆసక్తికరంగా కనిపిస్తోంది. నేపథ్య సంగీతం.. కళ్యాణ్ దేవ్ లుక్ ఫ్రెష్ ఫీల్ ని తీసుకొచ్చాయి. కిన్నెరసాని ఎంపికతో మెగా అల్లుడిలో కొత్త యాంగిల్ కూడా బయటపడింది. మెగా హీరోలందరి కంటె డిఫరెంట్ గా తనని తాను ప్రెజెంట్ చేసుకోవాలన్న తాపత్రయం అతడిలో కనిపిస్తోంది. ఇలాంటి కొత్తదనంతో స్పెషల్ జానర్ చిత్రాల్ని ఇప్పటివరకూ మెగా హీరోలెవ్వరూ చేయలేదు.
కమర్శియల్ మాస్ ఇమేజ్ నేపథ్యం ఉన్న కథలనే మెగా యువ హీరోలంతా ఎంపిక చేసుకుంటున్నారు. కానీ కళ్యాణ్ `సూపర్ మచ్చి` లాంటి కమర్శియల్ కథాంశాలకు ఛాన్స్ ఇస్తూనే..మరోవైపు డిఫరెంట్ జానర్లను టచ్ చేస్తున్నట్లు కనిపిస్తుంది.
యంగ్ హీరో నిఖిల్.. శర్వానంద్ కెరీర్ ఆరంభంలోనే ప్రయోగాలతో సక్సెసయ్యారు. అదే బాటలో కళ్యాణ్ కంటెంట్ తోనే సక్సెస్ అవ్వాలని ప్లాన్ చేస్తున్నారు. తనని ప్రేక్షకుల్లో బలంగా ప్రోజెక్ట్ చేయాలంటే స్క్రిప్టు లు చాలా కీలకం. కంటెంట్ ఉన్న స్క్రిప్టులతో యువహీరోలు రాణిస్తున్నారు కాబట్టి అదే పంథాలో వెళ్లాలనేది అతడి ఆలోచన. ఇప్పుడు ఇతర హీరోలతో పోల్చి చూస్తే.. కళ్యాణ్ దేవ్ ఆ విషయంలో ఇంకాస్త ముందుగానే మేల్కొని ప్లాన్ ని ఛేంజ్ చేశారట.