Begin typing your search above and press return to search.

మెగా చిన్నల్లుడి కీలక ప్రకటన

By:  Tupaki Desk   |   25 Oct 2019 2:12 PM GMT
మెగా చిన్నల్లుడి కీలక ప్రకటన
X
మెగాస్టార్‌ చిరంజీవి చిన్నల్లుడు కళ్యాణ్‌ దేవ్‌ 'విజేత' చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన విషయం తెల్సిందే. మొదటి సినిమాతో నిరాశ పర్చిన కళ్యాణ్‌ దేవ్‌ తన రెండవ సినిమాకు కాస్త గ్యాప్‌ తీసుకున్నాడు. ఎన్నో కథలు విన్న కళ్యాణ్‌ దేవ్‌ ఇదే సమయంలో నటన మరియు డాన్స్‌ ల్లో ప్రావిణ్యం పొందినట్లుగా సమాచారం అందుతోంది. ఎట్టకేలకు కళ్యాణ్‌ దేవ్‌ రెండవ సినిమా గురించిన అఫిషియల్‌ అనౌన్స్‌ మెంట్‌ వచ్చింది. కళ్యాణ్‌ దేవ్‌ ఈ విషయాన్ని ట్విట్టర్‌ ద్వారా ప్రకటించాడు.

తన రెండవ సినిమా టైటిల్‌ మరియు ఫస్ట్‌ లుక్‌ ఇతర విషయాలను రేపు ఉదయం 11 గంటలకు వెళ్లడించబోతున్నట్లుగా చెప్పుకొచ్చాడు. ఈ సినిమాను రిజ్వాన్‌ ఎంటర్‌ టైన్‌ మెంట్స్‌ బ్యానర్‌ లో నిర్మిస్తున్నారు. అంతకు మించి ఈ సినిమాకు సంబంధించిన ఎలాంటి అప్‌ డేట్‌ లేదు. రేపు సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలను క్లారిటీ ఇచ్చే అవకాశం ఉంది.

సినిమా ఇప్పటికే ప్రారంభం అయ్యిందా లేదంటే త్వరలోనే ప్రారంభం కాబోతుందా అనే విషయంపై కూడా మెగా హీరో కళ్యాణ్‌ దేవ్‌ రేపు క్లారిటీ ఇచ్చే అవకాశాలున్నాయి. కళ్యాణ్‌ దేవ్‌ హీరోగా పులి వాసు దర్శకత్వంలో 'కండోమ్‌ ఫ్యాక్టరీ' అనే చిత్రం తెరకెక్కబోతుంది అంటూ కొన్ని రోజుల క్రితం వార్తలు వచ్చాయి. మరి అదే సినిమాను రేపు ప్రకటించబోతున్నారా లేదంటే మరేదైనా ప్రాజెక్ట్‌ కు కళ్యాణ్‌ ఓకే చెప్పాడా చూడాలి.